Account Ban On WhatsApp : ప్రపంచలోనే అత్యధిక యూజర్లు ఉపయోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఒక్క భారత్లోనే ఈ యాప్ ను 60 కోట్ల మంది వాడుతున్నారు. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియో షేర్ చేసేందుకు ఎక్కువగా వినియోగించే వాట్సాప్ తో కాల్స్, వీడియో కాల్స్ కూడా తేలికగా చేసుకోవచ్చు. ఇక యూజర్స్ భద్రత కోసం వాట్సప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిత్యం మిలియన్స్ లో యూజర్స్ వాట్సాప్ ను ఉపయోగించడంతో ఈ ప్లాట్ఫారం దుర్వినియోగం అయ్యే అవకాశం సైతం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాట్సప్ కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. వాట్సాప్ లో అనుమతిలేని కంటెంట్ షేర్ చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే ఆ కంటెంట్ ఏంటి? ఎలాంటి వాటిని షేర్ చేయకూడదు అనే విషయం తెలుసుకుందాం.
దేశానికి వ్యతిరేక పోస్టులు – భారత్ కు సంబంధించి వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు, వీడియోలు షేర్ చేయకూడదు. ముఖ్యంగా దేశ ప్రశాంతతను చెడగొట్టే వీడియోలు షేర్ చేయకూడదు. ఉగ్రవాదులకు, దేశ ద్రోహులకు సంబంధించిన పోస్టులు సైతం నిషేదం. ముఖ్యంగా అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే కంటెట్ ను షేర్ చేస్తే కఠిన శిక్షలు తప్పువు.
అడల్ట్ కంటెంట్ – అడల్ట్ కంటెంట్ ను వాట్సాప్ లో షేర్ చేయటం నేరం. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదు. ఇటువంటి కంటెంట్ పై ఇప్పటికే భారత్లో నిషేధం ఉండటంతో వీటిని వాట్సప్ లో షేర్ చేయడం మరింత నేరం.
ప్రైవేట్ చాట్ – వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ చాట్, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ లో షేర్ చేయకూడదు. ఇలాంటి కంటెంట్ ను షేర్ చేసే వారి ఎకౌంట్ ను వాట్సప్ బ్యాన్ చేస్తుంది. ఇంకా చట్టపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ – చిన్నపిల్లలకు సంబంధించిన పోర్నోగ్రఫీ లేదా దోపిడీలకు సంబంధించిన కంటెంట్ ను షేర్ చేస్తే వాట్సాప్ అకౌంట్ ను వెంటనే నిషేధిస్తారు.
తప్పుడు సమాచారం – ఒక విషయానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వాట్సప్ లో పదేపదే పంపించడం పెద్ద నేరం. ముఖ్యంగా ఎవరైనా సెలబ్రిటీలు చనిపోయారని అబద్ధపు ప్రచారాలు చేయటం, డబ్బులకు ఆశపడి తప్పుడు పోస్టులు పంపించడం నేరం.
సైబర్ నేరాలు – సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పంపిస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది.
ఎక్కువమందికి ఫార్వాడ్ చేయటం – ఒక సమాచారాన్ని పదే పదే ఎక్కువ మందికి పంపటం సైతం నేరం. ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని పంపిస్తే సమాజాన్ని తప్పుదోవలో నడిపే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి కంటెంట్ పైన ఆంక్షలు ఉన్నాయి.
ఇక వాట్సాప్ లో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పంపించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా వాట్సాప్ లో ఒక నెంబర్ పైన ఐదుసార్లు కంటే ఎక్కువ రిపోర్ట్స్ రాకూడదుయ ఇలా వచ్చిన అకౌంట్స్ ను వాట్సాప్ బ్యాన్ చేస్తుంది. ఇలా తప్పుడు సమాచారం పంపిస్తే పరువు నష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే వాట్సాప్ లో ఒక సమాచారాన్ని పంపే ముందు నిజమా కాదా అనే విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.
ALSO READ : కిర్రాక్ ఫీచర్స్ తో వచ్చేస్తున్న రెడ్ మీ K80 సిరీస్.. లాంఛ్ డేట్ ఎప్పుడంటే!