ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం రాష్ట్రంలో తమకు దగ్గరగా ఉన్న వాగులు, వంకలలో ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని చాలా వాగుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. లిమిట్ కు మించి ఇసుకను తోడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలేరు కాలువలో ఇసుక తవ్వేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన అడ్డతీగల మండలం బొంగరాలపాడు గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో చోటు చేసుకుంది.
Also Read: తండ్రిని పట్టించుకోని కొడుకు.. రాసిచ్చిన ఆస్తిని తీసుకుని షాక్ ఇచ్చిన తండ్రి!
గల్లంతు అయిన నలుగురు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందినవారిలో పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం అడ్డతీగల పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉచిత ఇసుక మంచిదే అయినప్పటికీ అక్రమార్కులు ఇసుకనంతా తోడేయడం వల్ల గుంటలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో సామాన్యులు సైతం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై నియంత్రణ పెట్టాలని పలువురు కోరుతున్నారు.