Elon Musk : టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్ (Space X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో మస్క్ క్రిప్టో కరెన్సీ కోసం ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వీడియో వైరల్ గా మారింది. అయితే అసలు దీని వెనుకు అసలు కథ ఏంటి? అసలు ఈ విషయం ఎందుకు వివాదాస్పదంగా మారిందో తెలుసుకుందాం.
ఎలోన్ మస్క్ క్రిప్టో కరెన్సీ బహుమతిని ప్రమోట్ చేస్తున్న వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తుంది. అయితే ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది డీప్ ఫేక్ వీడియో. ఇప్పటికే ఎందరో సెలబ్రెటీలు ఈ డీప్ ఫేక్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోగా తాజాగా ఎలాన్ మస్క్ సైతం ఈ సమస్యను ఎదుర్కున్నారు.
AI టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సమస్యలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరికీ బెదిరింపులు రావటమేకాకుండా ప్రమాదాలు సైతం పొంచి ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సెగ SpaceX, Tesla యజమాని ఎలోన్ మస్క్ ను చేరింది. మస్క్ 20 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ బహుమతిని తప్పుగా ప్రచారం చేస్తున్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. మల్టీ మిలియన్ డాలర్ల వ్యాపారవేత్త క్రిప్టోకరెన్సీ బహుమతులను ప్రోత్సహిస్తున్నట్లు, Elon4u.com అనే వెబ్‌సైట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఈ వీడియో హల్చల్ చేస్తుంది.
ఏమిటి విషయం?
ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీ బహుమతిని ప్రమోట్ చేస్తున్న వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. “ఈ విషయం అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా నిజం. నేను డిసెంబర్ 13 నుండి ఒక వారం పాటు Elon4u.comలో $20 మిలియన్ల క్రిప్టో బహుమతిగా ఇస్తా. ఇది నిజంగా డబ్బులు వచ్చే మంచి అవకాశం. నా మాట నమ్మకపోతే Elon4u.comకి వెళ్లండి. అందులో మీకే కనిపిస్తుంది. ఇందుకు మూడు నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు..” ఉంది.
ఈ వీడియో ఒక్కసారిగా బయటకు రావటంతో పూర్తిగా నకిలీ, AIను ఉపయోగించి రూపొందించారని టెక్ నిపుణులు గుర్తించారు. ఇక కొందరు ట్విట్టర్ వినియోగదారులు సైతం ఈ వీడియో డీప్‌ఫేక్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి స్కామ్స్ ఎన్నో జరిగాయని.. వీటిలో వినియోగదారులు చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ట్విట్టర్ లో సైతం “బ్రేకింగ్ : ఎలాన్ మస్క్ డీప్‌ఫేక్ వీడియో $20 మిలియన్ల క్రిప్టో బహుమతిని ప్రచారం చేస్తోంది. ఎలోన్ మస్క్, అతని కంపెనీలు ఎటువంటి క్రిప్టో బహుమానాల కోసం ప్రమోట్ చేయదు. ఇలాంటివి నమ్మి మోసాల జోలికి పోకండి! సురక్షితంగా ఉండండి..” అంటూ పోస్ట్ చేస్తున్నారు.
డీప్‌ఫేక్ వీడియోను ఎలా గుర్తించాలి –
డీప్‌ఫేక్ వీడియోను గుర్తించడం అంత తేలికైన పని కాదు. అయితే ముఖ కవళికలు, మాట్లాడే తీరు బట్టి పసిగట్టే అవకాశం ఉంటుంది. ఇక లిప్ సింక్ ను బట్టి గుర్తించాలి. బ్యాగ్రౌండ్, లైటింగ్ సైతం అనుమానాస్పదంగా ఉంటాయి.
ALSO READ : లావా జోరు.. డ్యూయల్ స్క్రీన్ తో కొత్త మెుబైల్ లాంఛ్