Sudigali Sudheer- Rashmi: సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ స్టార్ హీరో ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే ఫ్యాన్స్ అందరూ ఆమెను వదినలానే ట్రీట్ చేస్తారు. హీరోకు ఎంత గౌరవం ఇస్తారో.. ఆమెకు కూడా అంతే గౌరవమిస్తారు. వారిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా.. ? అని వెయ్యి కళ్ళతో వీరే ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఏదైనా జరిగి ఆ జంట విడిపోతే వారికన్నా ఎక్కువ అభిమానులే బాధపడుతూ ఉంటారు.
స్టార్ హీరోల విషయంలో ఇది జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇదంతా ఒక కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన సుడిగాలి సుధీర్ లైఫ్ కూడా జరుగుతుంది. జబర్దస్త్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్.. అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. వేణు వండర్స్ టీమ్ లో కంటెస్టెంట్ గా సుధీర్ వచ్చాడు. ఇక కొన్ని ఎపిసోడ్స్ తరువాత సుధీర్ కు యాంకర్ రష్మీకి లవ్ ట్రాక్ పెట్టారు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఈ లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది. వీరిద్దరూ ఎప్పుడు కనిపించినా వీరి కళ్ళలో ఆ ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. అయితే తామెప్పుడూ బయట ప్రేమించుకోలేదని.. ఈ లవ్ ట్రాక్ కేవలం ఫ్యాన్స్ ను ఆనందపర్చడానికి మాత్రమే అని వారిద్దరూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం సుధీర్ – రష్మీ ఎవరి కెరీర్స్ లో వారు బిజీగా ఉన్నారు. సుధీర్ ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలు కూడా చేస్తున్నాడు.
Pushpa 2: సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసిన పీలింగ్స్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..
సుధీర్ నటిస్తున్న తాజా చిత్రం గోట్ ఆర్థిక సమస్యల వలన ఆగిపోయిందని సమాచారం. అందుకే ఆ సినిమాను పక్కన పెట్టి మళ్లీ యాంకర్ గా బిజీగా మారాడు. ఇక రష్మీ కూడా ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క షోస్ తో తీరిక లేకుండా పనిచేస్తుంది. ఈ జంటఎక్కడ కనిపించినా వీరికి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు.. ? ఇదంతా పక్కన పెడితే.. ఇటీవల సుధీర్ పెళ్లి వార్తలు రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఒక నిర్మాత కూతురుతో సుధీర్ పెళ్లి జరుగుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రష్మీతో సుధీర్ మాత్రం ఇంకా తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయారట. కొన్ని విభేదాల వలన ఈ జంట విడిపోయినట్లు టాక్ నడుస్తోంది. తాజాగా ఒక షోలో సుధీర్ తో విడిపోవడానికి గల కారణాలను రష్మీ చెప్పుకొచ్చింది. కరెక్ట్ గా ప్రపోజ్ చేయడం రాక మన కళ్లెదురుగానే ఇద్దరు విడిపోయారు.. వారే సుధీర్- రష్మీ.
Dacoit: అడివి శేష్ తో మృణాల్ రొమాన్స్.. ఎట్టకేలకు తెలిసిపోయింది.. ?
అసలు ఎలా ప్రపోజ్ చేసావ్.. ? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని రాంప్రసాద్.. రష్మీని అడగ్గా.. ” మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. కొంతమందికి హోటల్ లా ఉంటాయి.. ఎక్కువమంది ఉంటారు. కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది” అని చెప్పుకొచ్చింది. అయితే ఈ మాట రష్మీ సరదాకు అన్నదో.. స్కిట్ పరంగా అన్నదో అని తెలియదు కానీ.. ఈ జంట విడిపోకుండా చూడు దేవుడా అని అభిమానులు మాత్రం గట్టిగానే ప్రార్థిస్తున్నారు. మరి వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది అయినా అవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.