E-Paper
Advertisement

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!
Advertisement

Dell XPS 13: ప్రముఖ డెల్ కంపెనీ భారత్‌లో తమ ప్రీమియం ల్యాప్‌టాప్ శ్రేణిని మరింత విస్తరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు, మెరుగైన డిస్‌ప్లేలు, సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌తో కూడిన XPS 13, డెల్ 14S, డెల్ 16S మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు.

ధరలు ఎంతంటే?

డెల్ XPS 13 ప్రారంభ ధర రూ.79,990 కాగా.. ఇది స్కై, స్టార్మ్ రంగుల్లో లభిస్తుంది. డెల్ 14S వేరియంట్ ధర రూ.1,19,990 నుండి, భారీ స్క్రీన్ కలిగిన డెల్ 16S ధర రూ.2,29,990 నుండి ప్రారంభమవుతుంది. ఇవి సెలెస్టియల్ బ్లూ, ఫ్రాస్ట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. డెల్ షోరూమ్‌లతో పాటు ఆన్‌లైన్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

చిన్న సైజులో పవర్‌ఫుల్ XPS 13:

Advertisement

ట్రావెల్ చేస్తూ పనిచేసే వారికి XPS 13 అనువైనది. ఇందులో 13.4 అంగుళాల 2.5K టచ్ డిస్‌ప్లేను అందించారు. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 17 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. కేవలం ఒక కేజీ బరువు, 12.7 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్లు, వైఫై 7 సపోర్ట్ ఉన్నాయి.

Also Read: రూ.16 వేలకే రఫ్ అండ్ టఫ్ ఫోన్.. సన్‌రైజ్ గోల్డ్ కలర్‌లో ఆకట్టుకుంటున్న Honor X6e 4G!

డెల్ 14S, 16S ప్రత్యేకతలు:

Advertisement

డెల్ 14S మోడల్ 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ OLED స్క్రీన్‌తో వస్తుండగా.. 16S వెర్షన్ 16 అంగుళాల 2.8K OLED టచ్ స్క్రీన్‌తో వస్తుంది. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వీటిలో ఇంటెల్ Core Ultra Series 3 లేదా AMD Ryzen AI 400 సిరీస్ చిప్‌సెట్‌లను ఎంచుకోవచ్చు. ఏఐ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

పర్యావరణానికి హాని కలగకుండా:

ఈ రెండు మోడళ్లలోనూ 70Wh బ్యాటరీ, 65W టైప్-సి ఛార్జింగ్, కావాల్సినన్ని కనెక్టివిటీ పోర్టులను అందించారు. పర్యావరణానికి హాని కలగకుండా రీసైకిల్ చేసిన అల్యూమినియం, ప్లాస్టిక్‌తో వీటిని తయారు చేయడం విశేషం. ప్రీమియం లుక్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్.

Also Read: భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

Related News

బడ్జెట్ ధరలో.. మైండ్ బ్లోయింగ్ ఆడియో! ఈ బ్లూటూత్ స్పీకర్ పై ఓ లుక్కేయండి

రూ.16 వేలకే రఫ్ అండ్ టఫ్ ఫోన్.. సన్‌రైజ్ గోల్డ్ కలర్‌లో ఆకట్టుకుంటున్న Honor X6e 4G!

ప్రీమియం లుక్స్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు..ఈ స్మార్ట్‌వాచ్ ధర ఎంతంటే?

బ్లూటూత్ ఇయర్‌బర్డ్స్‌ కింగ్ వచ్చేసింది..డోంట్ మిస్

సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్..ఇంట్లోనే! ఈ సౌండ్‌బార్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్!

కలర్‌ఫుల్ నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. రైజెన్ 7 ప్రాసెసర్‌, 2.5K డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

Big Stories

Advertisement
×