E-Paper
Advertisement

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?
Advertisement

WhatsApp Auto Download: నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఉండే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఆఫీస్ పనులు, కుటుంబ సభ్యుల కబుర్లు, ఫ్రెండ్స్ గ్రూప్‌లు.. ఇలా రోజూ పదుల సంఖ్యలో సందేశాలు, ఫొటోలు, వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే మనకు తెలియకుండానే ఇవన్నీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ నిండిపోవడమే కాకుండా.. డేటా కూడా వృధా అవుతుంటుంది. అందుకే వాట్సప్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే.. స్టోరేజ్ సమస్య నుంచి బయటపడొచ్చు.

వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్తే Storage and Data అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Media auto-download విభాగంలో మొబైల్ డేటా, వైఫై వాడేటప్పుడు ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. అన్నింటికీ ఆటో డౌన్‌లోడ్ నిలిపివేస్తే.. మనకు కావలసిన ఫోటో లేదా వీడియోపై క్లిక్ చేసినప్పుడు మాత్రమే అది డౌన్‌లోడ్ అవుతుంది.

Advertisement

Also Read: 25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

మనకు వచ్చే ప్రైవేట్ ఫొటోలు లేదా గ్రూప్‌లలో వచ్చే మెసేజ్‌లు నేరుగా ఫోన్ గ్యాలరీలోకి వెళ్తే ఇబ్బందిగా అనిపించవచ్చు. అలా జరగకుండా ఉండటానికి Media visibility ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ చాట్ ఫొటోలు గ్యాలరీలో కనిపించకూడదో, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఈ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్స్ కేవలం వాట్సప్‌లోనే ఉంటాయి.

Advertisement

అలాగే వాట్సప్‌లోనే ఉండే Manage Storage ఆప్షన్ ద్వారా ఎక్కువ సైజ్ ఉన్న వీడియోలు, పదే పదే ఫార్వర్డ్ అయిన ఫైళ్లను సులభంగా గుర్తుపట్టవచ్చు. అనవసరమైన వాటిని అప్పటికప్పుడు డిలీట్ చేయడం వల్ల ఫోన్ మెమరీ ఖాళీ అయి, ఫోన్ హాంగ్ అవ్వకుండా వేగంగా పనిచేస్తుంది.

కేవలం ఫోన్ స్టోరేజ్ మాత్రమే కాకుండా.. గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ బ్యాకప్‌లో కూడా వీడియోలను మినహాయించడం మంచిది. బ్యాకప్ సెట్టింగ్స్‌లో Include videos ఆప్షన్ ఆఫ్‌ చేయడం వల్ల క్లౌడ్ స్టోరేజ్ త్వరగా నిండిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ చిన్న మార్పులతో మీ ఫోన్ గ్యాలరీ నీట్‌గా ఉండటమే కాకుండా.. స్టోరేజ్ సమస్యలు రాకుండా ఉంటుంది.

Also Read: ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×