E-Paper
Advertisement

GHMC Vehicles: జీహెచ్ఎంసీలో బిగ్ స్కామ్.. బైక్ నెంబర్లతో కారు బిల్లులు క్లెయిమ్..!

GHMC Vehicles: జీహెచ్ఎంసీలో బిగ్ స్కామ్.. బైక్ నెంబర్లతో కారు బిల్లులు క్లెయిమ్..!
Advertisement

GHMC Vehicles: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అతి పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలో అధికారులు కొత్త రకం అక్రమార్జనకు తెర దీశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి నుంచి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మొదలుకుని కమిషనర్ క్యాడర్ వరకు ప్రతి రోజు ఆఫీసుకు రాకపోకలు సాగించేందుకు, ఫీల్డు తనిఖీలకు వెళ్లేందుకు వీలుగా హోదాలను బట్టి కార్లను కేటాయించారు. కానీ మోటారు వెహికల్ యాక్టు ప్రకారం అద్దెకు తీసుకునే కారు ఎల్లో నెంబర్ ప్లేటు కలిగి ఉండాలన్న నిబంధనను తుంగలో తొక్కి, కొందరు అధికారులు ఏకంగా వైట్ నెంబర్ ప్లేట్లు కల్గిన తమ సొంత వాహానాలను ఎంగేజ్ చేసుకుని డీజిల్ ఎక్కువ ఖర్చు కాకుండా ఫీల్డు తనిఖీలకు వెళ్లకుండా కేవలం ఆఫీసుకే రాకపోకలు సాగిస్తూ ప్రతి నెల రూ. 34 వేలు, ఆ పై చిలుకు కారు అద్దె బిల్లులను క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ట్రాన్స్ పోర్టులో పైరవీలు

మరి కొందరు అధికారుల హోదా కారు కేటాయింపునకు దిగువన ఉన్నా, ట్రాన్స్ పోర్టు విభాగంలో పైరవీలు చేసుకుని, ఈఎంఐల్లో కొత్త కార్లను కొనుగోలు చేస్తూ కూడా బిల్లుల క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరి కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి తమ క్యాడర్ కు కారు కేటాయింపు ఉన్నా, బైక్ లపై ఆఫీసుకు రాకపోకలు సాగిస్తూ బైక్ నెంబర్ నే కారు నెంబర్ గా చూపిస్తూ ప్రతి నెల బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమాలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బిల్లులు క్లెయిమ్..

Advertisement

ఈ రకంగా ఒక్క జీహెచ్ఎంసీలోనే సుమారు 80 నుంచి 90 మంది అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేటు కల్గిన సొంత వాహానాలను వినియోగిస్తున్నట్లు గతంలోనే గుర్తించినా, అధికారులెలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. సర్కిళ్లలో అసలు కారు వినియోగానికి సరిపోయే హోదా లేని సూపరింటెండెంట్ , మేనేజర్ స్థాయి అధికారులు కూడా డిప్యూటీ కమిషనర్లను మేనేజ్ చేసుకుని కార్లను వినియోగిస్తూ, వాటి బిల్లులను క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Also read: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

డీసీఓను నీరు కార్చుతున్న అధికారులు

Advertisement

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న మహా సంకల్పంతో 2014 నుంచి దాదాపు రెండేళ్లలో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ రెండేళ్ల వ్యవధిలొ 300 పై చిలుకు షిఫ్టు డిజైర్ వాహానాలను నిరుద్యోగులకు సమకూర్చి, వాటిని జీహెచ్ఎంసీ లోనే ఎంగేజ్ చేశారు. వీటి లబ్దిదారులకు తొలి విడత చెల్లించాల్సిన సొమ్ము మినహా మిగిలిన ఈఎంఐలకు బ్యాంక్ గ్యారంటీని జీహెచ్ఎంసీయే సమకూర్చి, దాదాపు 300 పై చిలుకు వాహానాలను కేటాయించింది. వీటిలో దాదాపు వంద వరకు కార్లను జీహెచ్ఎంసీలోని వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులకు కేటాయించి, వారికి ప్రతి నెల బిల్లులను చెల్లిస్తున్నారు . కానీ కొందరు అధికారులు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ ను నీరుగార్చేందుకు డ్రైవర్లపై లేనిపోని ఆరోపణలు చేయటంతో పాటు సెలవు రోజుల్లో కూడా డ్రైవర్ కమ్ ఓనర్ కార్లను వినియోగించటంతో ఖర్చు ఎక్కవ కావటంతో చాలా మంది లబ్దిదారులకు తమ కార్లను జీహెచ్ఎంసీ నుంచి తప్పించి, ప్రైవేటుగా ఊబర్, ఓలాలకు ఎంగేజ్ చేసుకున్నారు.

అద్దెలు పెంచాలి..

జీహెచ్ఎంసీలో ప్రస్తుతం డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద ఎంగేజ్ అయిన వాహానాల సంఖ్య చాలా వరకు తగ్గి, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు పొందిన ఈ స్కీమ్ ఇపుడు నీరుగారిపోయింది. ఈ స్కీమ్ కింద ఇంకా కొందరు లబ్దిదారులు జీహెచ్ఎంసీలోనే వాహానాల ఎంగేజ్ ను కొనసాగిస్తున్నా, సకాలంలో నెలసరి బిల్లులు అందక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కొనసాగుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పెంచి కార్ల నెలసరి బిల్లులను జీహెచ్ఎంసీలో కూడా పెంచాలని ఇటీవలే పలువురు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ డ్రైవర్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిసింది.

Also read: Today Movies in TV : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. టీవీలో వీటిని మిస్ అవ్వకండి..

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×