Big Stories

Experiments for making biological robots speed up : రోబోలకు కొత్త రూపం.. శాస్త్రవేత్తల ప్రయోగం..

Experiments for making biological robots speed up : శాస్త్రవేత్తలు సృషించిన ఎన్నో అద్భుతాల్లో రోబోలు కూడా ఒకటి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి వాటి సాయంతో రోబోల గురించి చాలామందికి తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం చాలావరకు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా రోబోలకు మరో కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది.

- Advertisement -

ముందుగా రోబోలు నడిచాయి. ఆ తర్వాత అవి వెలుగును చూడగలిగాయి. ఇప్పుడు ఏకంగా రిమోట్ కంట్రోల్‌ను గుప్పెట్లో పెట్టుకోనున్నాయి రోబోలు. ప్రముఖ యూనివర్సిటీలు చేసిన పరిశోధనల్లో రోబోలకు ఖండలను జోడించారు. పలు కణాలను, మనిషి ఖండలను, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ను రోబోలకు జోడించే క్రమంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. దానికి హైబ్రిడ్ ఈబయోటిక్స్ అని పేరు కూడా పెట్టారు.

- Advertisement -

మైక్రో ఎలక్ట్రానిక్స్ ద్వారా బయోలాజికల్ ప్రపంచాన్ని, ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్ని కలపవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విధంగా తయారు చేసే రోబోలు భవిష్యత్తులో మెడికల్, వాతావరణానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఎలుక ఖండను తీసుకొని ముందుగా బయోలాజికల్ రోబోలను తయారు చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఈ బయోబోట్స్‌ను తయారు చేయాలనే ఆలోచన శాస్త్రవేత్తలకు 2012లోనే వచ్చినా కూడా ప్రాక్టికల్‌గా తయారు చేయడానికి కష్టంగా మారింది.

టెక్నాలజీని, బయోలజీని కలిపితే ఇంజనీరింగ్‌లో ఎన్నో కొత్త మార్పులు వస్తాయి. బయోమెడిసిన్ లాంటి విభాగాల్లో కూడా ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుంది. బయోబోట్స్ సులువుగా ముందుకు వెళ్లాలంటే వాటికి బరువైన బ్యాటరీలు, ఎక్కువ వైర్లు అంటించకుండా ఉండాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఒక వైర్‌లెస్ ద్వారా బయోబోట్స్‌కు సూచనలు పంపాలని వారు అనుకుంటున్నారు. ఈ సెన్సార్ల ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను కూడా బయోబోట్స్ గుర్తించగలవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ హైబ్రిడ్ బయో ఎలక్ట్రానిక్ రోబో ద్వారా టెక్నాలజీ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News