E-Paper
Advertisement

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!
Advertisement

Noise Alt Watch 1 Smartwatch: చేతికి స్టైలిష్ లుక్ ఇవ్వడంతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని.. కచ్చితంగా పర్యవేక్షించడానికి మంచి స్మార్ట్‌ వాచ్ కొనాలని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ప్రీమియం ఫీచర్లు ముఖ్యంగా బిల్ట్-ఇన్ జీపీఎస్ ఉన్న వాచ్‌లు సాధారణంగా .. చాలా ఖరీదుగా ఉంటాయి. ఈ సమస్యకు చెక్.. పెడుతూ ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ‘నాయిస్’ అద్భుతమైన ఫీచర్లతో.. కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది.అదే Noise Alt Watch 1. ప్రస్తుత మార్కెట్లో దీని ధర కేవలం రూ. 4,999 మాత్రమే ఉండటం గమనార్హం. తక్కువ ధరలో.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే ఈ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. 1.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, డిజైన్ :

ఈ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఆకర్షణ దీని డిస్‌ప్లే. రూ. 4,999 బడ్జెట్‌లో.. 1.32 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను అందించడం నిజంగా అద్భుతమనే.. చెప్పాలి. దీని డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా, రంగులు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. ఎండలో.. బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే. దీని మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్ చేతికి చాలా ఆకర్షణీయంగా, రిచ్ లుక్‌ను ఇస్తుంది. క్యాజువల్ వేర్ లేదా ట్రెండీ ఔట్‌ఫిట్స్‌పైకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.

2. బిల్ట్-ఇన్ జీపీఎస్ సపోర్ట్ :

Advertisement

ఈ వాచ్‌లోని అత్యంత ముఖ్యమైన, ప్రత్యేకమైన ఫీచర్ బిల్ట్-ఇన్ జీపీఎస్ . సాధారణంగా ఈ ప్రైస్ రేంజ్ వాచ్‌లలో.. ఫోన్ జీపీఎస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ.. ఇందులో ప్రత్యేకంగా జీపీఎస్ ఉండటం వల్ల మీరు రన్నింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ చేసేటప్పుడు.. ఫోన్‌ను ఇంటి వద్దే వదిలేసి వెళ్లినా రూట్ మ్యాప్ కచ్చితంగా ట్రాక్ అవుతుంది. ఫిట్‌నెస్ లవర్స్‌కు, రన్నర్లకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.

3. ఏఐ సూట్, స్మార్ట్ ఫీచర్లు :

ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా ఇందులో పవర్ ఫుల్ ఏఐ సూట్ ను చేర్చారు. దీని వల్ల వివిధ రకాల స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్లు, క్విక్ రిప్లైస్, పర్సనలైజ్డ్ హెల్త్ ఇన్సైట్స్ లభిస్తాయి. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం.. వల్ల ఫోన్ చేతిలో లేకపోయినా నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్‌లు, వెదర్ అప్‌డేట్స్ వంటి అన్ని స్మార్ట్ నోటిఫికేషన్లను నేరుగా వాచ్ లోనే పొందొచ్చు.

Advertisement

Also Read: హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

4. హెల్త్ ,ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే.. SpO2 సెన్సార్,నిద్ర పోయే విధానాన్ని పర్యవేక్షించే స్లీప్ ట్రాకర్ వంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే .. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉండటం వల్ల మీ ప్రతీ వర్కవుట్‌ను కచ్చితంగా విశ్లేషించుకోవచ్చు.

కేవలం రూ. 4,999 బడ్జెట్‌లో 1.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ జీపీఎస్ , ఏఐ ఫీచర్లు కోరుకునే వారికి.. ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే, నిరభ్యంతరంగా దీనిని మీ లిస్టులో చేర్చుకోవచ్చు!

Related News

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

Big Stories

Advertisement
×