E-Paper
Advertisement

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!
Advertisement

TRAI New AI Rules: మన రోజువారీ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య భాగమైపోయింది. కస్టమర్ కేర్ సేవలు మొదలుకొని నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ వరకు మన దేశంలోని టెలికాం సంస్థలు ఏఐ సాంకేతికతను విరివిగా వాడుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సాంకేతికత పెరిగేకొద్దీ సమాచార భద్రత, సైబర్ దాడులు, ఆటోమేటెడ్ నిర్ణయాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. అందుకే భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఒక అడుగు ముందుకేసి, టెలికాం రంగంలో ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో స్పష్టం చేస్తూ సరికొత్త మార్గదర్శకాల ముసాయిదాను అక్టోబర్ 30న తీసుకొచ్చింది. ఏఐ వ్యవస్థల వల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.

సంస్థలదే పూర్తి బాధ్యత..

TRAI ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ సొంత ఏఐ పాలసీలను రూపొందించుకోవాలి. వీటిని కంపెనీ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాదు.. థర్డ్ పార్టీ వెండర్ల నుంచి ఏఐ సాంకేతికతను తీసుకున్నప్పటికీ, దానివల్ల జరిగే ఫలితాలకు టెలికాం సంస్థలే పూర్తి బాధ్యత వహించాలి. రేపు ఏదైనా ఏఐ వ్యవస్థ తప్పుగా పనిచేస్తే బయటి టెక్నాలజీ కంపెనీపై నెపం నెట్టివేసి తప్పించుకోవడం ఇకపై కుదరదు.

Advertisement

Also Read: ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

మూడు రకాల రిస్క్ వర్గీకరణ..

ప్రమాద తీవ్రతను బట్టి ఏఐ వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించాలని ట్రాయ్ సూచించింది. నెట్‌వర్క్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఎక్కువ ప్రభావం చూపే వాటిని హై-రిస్క్ కింద ఉంచుతారు. మధ్యస్థ ప్రభావం ఉండే వాటిని మీడియం-రిస్క్ అని, తక్కువ ప్రభావం ఉన్న వాటిని లో-రిస్క్ వర్గంగా విడదీస్తారు. ఈ విభజన వల్ల ఏ రకం ఏఐ సేవలకు ఎంతటి పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు అవసరమో కంపెనీలకు ఒక స్పష్టత వస్తుంది.

వేగవంతమైన కంప్లైంట్ రిపోర్టింగ్..

Advertisement

ఏఐ వల్ల ఏవైనా పెద్ద సైబర్ ప్రమాదాలు లేదా భద్రతా సమస్యలు తలెత్తితే.. కంపెనీలు వాటిని వెంటనే గుర్తించి దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా తీవ్రమైన సంఘటనల గురించి ట్రాయ్‌కి నిర్దేశిత సమయంలో నివేదిక అందించాల్సి ఉంటుంది. ప్రతీ టెలికాం సంస్థలో ఏఐ గవర్నెన్స్ అండ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ముసాయిదా పేర్కొంది. ఇవి సిస్టమ్ ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ, పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాయి.

యూజర్లకు మెరుగైన రక్షణ..

ప్రస్తుతం సమాచార మార్పిడి, డిజిటల్ చెల్లింపుల వంటివన్నీ టెలికాం నెట్‌వర్క్‌ల మీదే ఆధారపడి నడుస్తున్నాయి. అందువల్ల సిస్టమ్ విఫలమైతే సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఏఐ వల్ల వినియోగదారులకు ఏదైనా నష్టం వాటిల్లితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇవి డ్రాఫ్ట్ మార్గదర్శకాలు మాత్రమే. నవంబర్ 27 వరకు సూచనలు స్వీకరించిన తర్వాత TRAI వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది.

Also Read: ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

Tags

Related News

ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

Big Stories

Advertisement
×