Facebook Friends Tab: ప్రస్తుత డిజిటల్ యుగంలో మన దోస్తులతో మాట్లాడటం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. ఉద్యోగం తర్వాత రీల్స్, వీడియోలు, ఓటీటీ చూడటం సహా అనేక మంది వీటితోనే స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్ల అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఫేస్‌బుక్.. ఇప్పుడు ఒక కొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. అదే Friends ట్యాబ్. దీని ద్వారా మీ స్నేహితుల పోస్ట్‌లు, స్టోరీస్, రీల్స్, పుట్టినరోజులు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను మాత్రమే చూపించే ప్రత్యేక ‘ఫ్రెండ్స్’ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. అనేక గ్రూప్స్, పేజీలు, స్పాన్సర్డ్ కంటెంట్ మధ్య, నిజమైన స్నేహబంధానికి చోటు కల్పించేందుకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
కొత్త ‘Friends’ ట్యాబ్ స్పెషల్ ఏంటి
స్నేహితులతో అనుబంధాన్ని పెంచేందుకు అవకాశం. గత కొన్ని సంవత్సరాల్లో ఫేస్‌బుక్ అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే, ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో పేర్కొన్నట్లు, స్నేహితుల చర్చలు కొంత వరకు తగ్గిపోయాయి. ఈ కారణంగా, ఫేస్‌బుక్ ఇప్పుడు యూజర్లను వారి స్నేహితులతో మరింత కలిపేలా ఈ కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీడ్‌లో కనిపించేవి ఏంటి?
-ఈ కొత్త Friends ట్యాబ్‌లో మీ స్నేహితులు పోస్ట్ చేసిన కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇందులో
-పోస్టులు (Photos, Videos, Status Updates) ఉంటాయి.
-స్టోరీస్ (24 గంటల తర్వాత మాయమయ్యే కంటెంట్),
-రీల్స్ (క్లుప్తమైన వీడియోలు)
-పుట్టినరోజులు (స్నేహితుల బర్త్‌డే రిమైండర్లు)
-ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు (మీకు వచ్చిన కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల లిస్టు)
Read Also: ATM Charges: ఏటీఎం క్యాష్ తీసుకుంటే 23 రూపాయల ఛార్జ్
ఎలాంటి పోస్టులు కనిపించవు?
-ఈ ఫీడ్ పూర్తిగా మీ స్నేహితుల కంటెంట్‌కు మాత్రమే కేటాయించబడింది. దీనిలో:
-ఫేస్‌బుక్ సిఫారసు చేసే పోస్టులు (Suggested Posts)
-యాడ్స్ లేదా ఇతర ప్రమోషనల్ కంటెంట్
-స్నేహితులు కాని వ్యక్తుల పోస్టులు ఇవేమీ కనిపించవు. అంటే, ఇది పూర్తిగా యూజర్ల వ్యక్తిగత అనుభవాన్ని మెరుగుపరిచేలా డిజైన్ చేయబడింది.
కొత్త Friends ట్యాబ్ ఉపయోగపడే విధానం
యూజర్లకు స్నేహితుల అప్డేట్‌లు మిస్ కాకుండా ఉండేలా చేయడం. యూజర్లు వారి స్నేహితుల పోస్టులు, అప్‌డేట్‌లను తేలికగా చూడగలుగుతారు. ఫేస్‌బుక్ ప్రధాన హోమ్ ఫీడ్‌లో యాడ్స్, రికమండెడ్ పోస్టులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, Friends ట్యాబ్ ద్వారా, యూజర్లు ఏకైకంగా వారి స్నేహితుల పోస్టులనే చూడగలుగుతారు.
ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లతో పోలిక
ఈ ఫీచర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 2022లో వచ్చిన ‘Following’, ‘Close Friends’ ఫీచర్లకు సమానంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమ ఫాలోయింగ్ వ్యక్తుల పోస్టులను చూడగలిగారు. ఇప్పుడు, అదే తరహాలో ఫేస్‌బుక్ కూడా ఈ కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది.
నిరంతర కనెక్టివిటీ కోసం అద్భుతమైన మార్గం
ముఖ్యంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య మరింత అనుబంధాన్ని పెంచేందుకు ఈ ట్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ప్రధాన లక్ష్యం ప్రజలను కలిపేలా ఉండటం. Friends ట్యాబ్ ద్వారా, మీ నిత్యజీవితంలో ముఖ్యమైన వ్యక్తుల పోస్ట్‌లు మిస్ కాకుండా ఉండవచ్చు.
కొత్త Friends ట్యాబ్ ఎలా యాక్సెస్ చేయాలి?
ప్రస్తుతం, ఈ ఫీచర్ కేవలం అమెరికా (USA), కెనడా దేశాల్లోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఇతర దేశాలకు ఎప్పుడొస్తుందో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈ ఫీచర్ త్వరలో మరిన్ని ప్రాంతాలకు వచ్చే అవకాశముంది.