E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట మొదలైన పెళ్లి సంబరాలు.. శ్రీవల్లి పెళ్లి కోసం భాగ్యం తంటాలు..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట మొదలైన పెళ్లి సంబరాలు.. శ్రీవల్లి పెళ్లి కోసం భాగ్యం తంటాలు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ నీళ్ల క్యాన్లు మోయ్యడం పై భాగ్యం పెద్ద రచ్చ చేస్తుంది. అందరిని పిలిచి అడుగుతుంది. నువ్వు రామరాజు గారి చిన్నబ్బాయి కదా మరి నువ్వేంటి ఇలా వాటర్ కెళ్ళు మూసుకున్నావ్ ఏంటి అని రామ రాజు వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తుంది. మీ చిన్నబ్బాయి ఎందుకు రాలేదంటే చాలా ముఖ్యమైన పని ఉండి రాలేకపోయాడు అన్నారు ఇదేనా ఆ ముఖ్యమైన పని వాటర్ కాయలు వేస్తున్నాడు అనేసి భాగ్యం ఎగతాళిగా మాట్లాడుతుంది. భాగ్యం మాటలకి అందరూ ఫీలవుతారు. కానీ ప్రేమ మాత్రం తప్పేంటి గౌరవంగా బతుకుతున్నాడు తప్ప దోపిడీ చేయలేదు దొంగతనం చేయలేదు కదా అనేసి వెనకేసుకొస్తుంది. అది చూసిన ధీరజ్ షాక్ అవుతాడు. తన చిన్న చిన్న ఖర్చులకోసం తాను సొంతంగా జాబ్ చేయాలని అనుకున్నాడు అలా ఇలా చేస్తున్నాడేమో అంతేకానీ వేరే ఉద్దేశం అయితే లేదు కదా అని ప్రేమ ధీరజ్ని వెనకేసుకొని వస్తుంది. ప్రేమ మాట్లాడటం చూసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అదేం లేదమ్మా అంత పెద్ద ఇంట్లో ఉండి కూడా ఇలా నీళ్ళకి వేయడంతో ఇంట్లో ఏమైనా సమస్యలేమో? లేకపోతే ఏదైనా గొడవలు జరిగాయేమో? తెలుసుకుందామని అడిగాను అంతే తప్ప మరి ఏ ఉద్దేశం లేదమ్మా అనేసి భాగ్యం అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ధీరజ్ ను అనడంతో ప్రేమ ముందుకు వచ్చి ధీరజ్ కు సపోర్ట్ గా నిలుస్తుంది. మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు ఎవరికీ ఎవరు కాకుండా పోరు ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా వెళ్లి ఈ నిశ్చితార్థం వేడుకల్ని ఇంకా సంతోషంగా చేద్దామని అందరూ అంటారు. ఇక ధీరజ్ మీ అందరూ నిశ్చితార్థం వేడుకలు అయిపోయేంత వరకు ఉండమని కోరుతారు. అందరి మాట కాదనలేక ధీరజ్ అక్కడ ఉంటాడు.. మొత్తానికి చందు ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ధీరజ్ రాక అసలు సంబరాలు మొదలవుతాయి. అందరూ సంతోషంగా ఉండడం చూసి రామరాజు సంతోష్ పడతాడు. అటు భాగ్యం ఫ్యామిలీ కూడా డాన్స్ లేస్తూ సరదాగా ఉంటారు. మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అనుకున్న దానికంటే గ్రాండ్ గానే పూర్తవుతుంది. ఇక భాగ్యం అనుకున్నట్లుగానే అందరికీ డబ్బులను ఇస్తుంది. భాగ్యం తెలివిని చూసి తన భర్త పొగడ్తల వర్షం కురిపిస్తారు.. ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది కానీ ఇక ఆలోచించేది పెళ్లి నేనెప్పుడూ చిన్న విషయాలు గురించి కాదు దాని తర్వాత గురించి ఆలోచిస్తాను అని భాగ్యం అంటుంది. ఈ పెళ్లి సవ్యంగా జరగాలంటే అల్లుడు గారే ముందుకు రావాలి అని భాగ్యం ప్లాన్ వేస్తుంది..

Advertisement

పెళ్లిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని భాగ్యం పట్టు బట్టి కూర్చుంటుంది. నిశ్చితార్థం అయిన తర్వాత శ్రీవల్లి చందుల మధ్య ప్రేమ పుడుతుంది. శ్రీవల్లి మెల్లగా చందు ని ట్రాప్ చేస్తుంది. చందు నిలాగేనా తన బుట్టలో వేసుకొని తన పుట్టింటి కష్టాలను పోగొట్టాలని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అటు చందు ఎంగేజ్మెంట్ ని తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు తన తమ్ముణ్ణి తన కన్న తండ్రి పెళ్లికి రావద్దు అని చెప్పడంతో బాధపడుతూ ఉంటాడు.

ధీరజ్ ని తీసుకొని సాగర్ చందు ఇద్దరు రామరాజ దగ్గరికి వెళ్తారు. మేము పేరుకే అన్నదమ్ములం కానీ స్నేహితులం కన్నా ఎక్కువగానే పెరిగాం నాన్న మా ముగ్గురిని విడదీయాలని నువ్వు అనుకుంటున్నావా అని చందు అడుగుతాడు. నాకు పెళ్లవుతుంది అంటే ముందుగా సంతోషించేది నా తమ్ముడే నాన్న నువ్వు ఆ సంగతి మర్చిపోతున్నావు.. వాడి పెళ్లికి ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే అసలు పెళ్లి చేసుకోను అని చందు మొండికేసి కూర్చుంటాడు. ఇక రామరాజు తన కొడుకు పెళ్లి కోసం ఆశలు పెట్టుకొని బతుకుతుంటాడు. ఇక తప్పక ధీరజ్ ను చందు పెళ్లి పనుల్లో బిజీ అవమని అంటాడు.

Advertisement

ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సాయం చేయాలి నేను ఏ తప్పులు చేయకుండా నన్ను కట్టడి చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ధీరజ్ సంతోషంలో ప్రేమని హగ్ చేసుకుంటాడు. తన భర్త సంతోషం కోసం ప్రేమ ఏదైనా చేస్తుందని అర్థమవుతుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ పుడుతుంది. మరి వీళ్ళిద్దరూ కలిసిపోతారా? లేదా శత్రువులుగా మిగిలిపోతారు అన్నది.. అలాగే చందు పెళ్లి సంబరాలు మొదలవుతాయి. ఇంట్లో అందరూ సంతోషంగా సందడి చేస్తూ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అలాగే అటు భాగ్యముల ఫ్యామిలీ కూడా పెళ్లికూతురు చేత అమ్మవారికి పొంగళ్ళు పెడతారు. పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేసాం పెళ్లి ఎలా చేయాలి అని భాగ్యమలు ఆలోచిస్తారు అయితే.. మన అల్లుడు గారే ఈ పెళ్లిని దగ్గరుండి చేసేలా చేయాలని భాగ్యం అంటుంది. ఒకరితో ప్రోమో అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Related News

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Big Stories

Advertisement
×