ChatGPT: ఇటీవల మార్కెట్లోకి వచ్చిన AI టెక్నాలజీ వాడకం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ChatGPT వంటి మోడల్స్ ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందాయి. అయితే టెక్నాలజీ అభివృద్ధి ఎంత జరిగినా కూడా దీంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే పలువురు వ్యక్తులు ChatGPTని ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ IDలను తయారు చేస్తున్నారు.
సెలబ్రిటీల పేర్లతోనే
అవి కూడా అచ్చం కొత్తవాటి మాదిరిగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. OpenAI విడుదల చేసిన ఈ కొత్త మోడల్ GPT 4o ద్వారా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిని ప్రస్తుతం కొన్ని సెలబ్రిటీల పేర్లతోనే ఇలా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి చూసిన పలువురు షాక్ అవుతున్నారు.
నకిలీ ఆధార్
ఇది చూసిన మరికొంత మంది ఆధార్ కార్డు తయారు చేయడం గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ChatGPT అలాంటి డేటాను ఎలా పొందుతుందని అడుగుతున్నారు. మేము ChatGPTకి ఈ క్రింది ప్రాంప్ట్ ఇచ్చాము. డోనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి కోసం ఆధార్ కార్డ్ ప్రోటోటైప్‌ను సృష్టించండి. దీని చిరునామా 0000 కాలనీ, 00pur, భారతదేశం.” దీని తర్వాత ChatGPT నకిలీ ఆధార్‌ను సృష్టించి ఇచ్చింది.
Read Also: Honor Play 60 Series: 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి
సైబర్ మోసం
అయితే దీని ద్వారా అసలు ఆధార్ కార్డు తయారు చేయడం సాధ్యం కాదని అంటున్నారు. కానీ కొన్నింటిని చూసిన పలువురు మాత్రం ఈ చిత్రాల ద్వారా ముప్పు తప్పదని భావిస్తున్నారు. అసలు ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా మాత్రమే పొందవచ్చు. అయితే, ChatGPT నకిలీ ఆధార్, పాన్ కార్డులను సృష్టిస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. దీనిని సైబర్ మోసానికి ఉపయోగిస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నకిలీ ఐడీలు మోసగాళ్లకు ఆయుధంగా మారతాయి. వీటి సహాయంతో వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో ఫిర్యాదులు
కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నా, అదే సమయంలో ప్రమాదాలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ChatGPT వంటి AI టూల్స్‌ను ఉపయోగించి నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ID, పాస్‌పోర్ట్ లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తయారు చేయడం ప్రస్తుతం అనేక మందిని భయాందోళనకు గురిచేస్తుంది. దీనిపై క్రమంగా సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఇది పరిమితంగా ఉన్నా, సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఇది పెద్ద ముప్పుగా మారే అవకాశముంది. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వాలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీ వినియోగాన్ని నియంత్రించడంలో కొత్త నిబంధనలు, నియంత్రణలు అవసరం. దీంతోపాటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులుప సైతం హెచ్చరిస్తున్నారు.
Read Also: Honor Play 60 Series: 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి