Indian Railways: రైల్వే ప్రయాణాల్లో ఇప్పటికీ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పర్సులు, సెల్ ఫోన్లతో పాటు ఇతర లగేజీని మాయం చేసేస్తుంటారు. చాలా మంది తమ ఫోన్లను పోగొట్టుకుని బాధపడుతుంటారు. ఏం చేయాలో తెలియక, తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ బాధపడుతారు. మరికొంత మంది రైల్వే సిబ్బందికి లేదంటే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఇకపై రైల్వే స్టేషన్లలో లేదంటే రైళ్లలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం లేదంటే దొంగతనం జరిగినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు రైల్వే అధికారులు. పొయిన ఫోన్లను బ్లాక్ చేయడం లేదంటే ట్రాక్ చేయడం కోసం టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సహకరించనున్నాయి.
ఫోన్ పోగొట్టుకుంటే ఏం చేయాలి?
రైల్వే ప్రయాణ సమయంలో లేదంటే రైళ్లలో ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, టెలికమ్యునికేషన్స్ విభాగం టెక్నికల్ హెల్ఫ్ అందిస్తుంది. ఈ మేరకు సంచార్ సాధీ పేరుతో కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఈజీగా ఫోన్ ను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ను తిరిగి పొందే అవకాశం లేని సందర్భంలో బ్లాక్ చేసే వెసులుబాటు కలుగుతుంది.
దొంగిలించబడిన ఫోన్లను ఎలా ట్రాక్ చేయాలి?
ప్రస్తుతం టెలికమ్యునికేషన్స్ విభాగం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రయాణీకులు పోగొట్టుకున్న ఫోన్లను ఈజీగా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా పొయిన ఫోన్ కు సంబంధించి IMEI నెంబర్ ను ఎంటర్ చేయాలి. దీని ద్వారా ఫోన్ ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ ను ఉపయోగించి పోయిన ఫోన్ ను బ్లాక్ చేయడంతో పాటు ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది.
కొత్త పోర్టర్ గురించి DoT ఏం చెప్పిందంటే?
ఇక టెలికమ్యునికేషన్స్ విభాగం కొత్తగా తీసుకొచ్చిన పోర్టల్ గురించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు షేర్ చేసింది. “రైల్వే స్టేషన్లలో, రైళ్లలో స్మార్ట్ ఫోన్లు పోయినా లేదంటే దొంగిలించబడినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిని RPF కమ్యూనికేషన్ యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఒకవేళ మీరు పోగొట్టుకున్న ఫోన్ తిరిగి పొందలేకపోతే, దాన్ని ఈ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని DoT వెల్లడించింది.
यात्रीगण कृपया ध्यान दे!
अब आप Railway Station या Train में अपने गुम/चोरी हुए Mobile Phone को RPF और Sanchar Saathi की मदद से Block और Trace कर सकते है pic.twitter.com/c3j6ETbV01
— DoT India (@DoT_India) April 3, 2025
Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!
రైల్వే ప్రయాణీకుల సంతోషం
టెలికమ్యునికేషన్స్ విభాగం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పోర్టల్ చాలా ఉపయోగకరంగా ఉందని ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసుకునే అవకాశం ఉందని, ఒకవేళ సాధ్యం కాని సమయంలో ఫోన్ లోని సమాచారం బయటకు వెళ్లకుండా బ్లాక్ చేసే అవకాశం కల్పించడం బాగుందన్నారు.
Read Also: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?