E-Paper
Advertisement

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!
Advertisement

Fire Boltt Axiom 2026: ప్రస్తుత రోజుల్లో చేతికి వాచ్ పెట్టుకోవడం అనేది కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాదు, అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. యూత్ అంతా స్మార్ట్‌ వాచ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే.. అమోలెడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్న వాచ్ కొనాలంటే .. కనీసం మూడు, నాలుగు వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ.. బడ్జెట్ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్ అందించే ప్రముఖ బ్రాండ్ ఫైర్-బోల్ట్ తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ‘ఫైర్-బోల్ట్ ఆక్సియమ్ 2026’ స్మార్ట్‌ వాచ్ ఈ లెక్కలన్నీ మార్చేసింది. దీని ధర కేవలం రూ. 1699 మాత్రమే! ఈ ధరలో.. ఇది ఆఫర్ చేస్తున్న ఫీచర్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన 1.43″ అమోలెడ్ డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌ వాచ్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ దీని డిస్‌ప్లే.రూ.2వేల లోపు బడ్జెట్‌లో చాలా కంపెనీలు సాధారణ ఎల్‌సీడీ స్క్రీన్ ఇస్తుంటే.. ఫైర్-బోల్ట్ ఏకంగా 1.43 ఇంచుల పెద్ద అమోలెడ్ స్క్రీన్‌ను అందించింది. అమోలెడ్ స్క్రీన్ కాబట్టి కలర్స్ చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా పగటిపూట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో హై-బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. అలాగే, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉండటం ఈ వాచ్‌కు మరింత ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.

ప్రీమియం డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

Advertisement

చూడటానికి అత్యంత స్టైలిష్‌గా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. దీని మెటాలిక్ ఫ్రేమ్ , స్కిన్-ఫ్రెండ్లీ సిలికాన్ స్ట్రాప్స్ కారణంగా రోజంతా పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు.. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. డయల్ ఫేసెస్ విషయానికి వస్తే.. యాప్‌లో వందకు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. మన మూడ్‌కి తగ్గట్లుగా రోజూ ఒక కొత్త డయల్ సెట్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ ఫీచర్లు:

ఈ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ అనేది.. మరో అద్భుతమైన ఫీచర్. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్ , స్పీకర్ ఉన్నాయి. మీ స్మార్ట్‌ ఫోన్‌కు వాచ్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు, ఫోన్ జేబులో నుంచి తీయకుండానే వాచ్ నుంచే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. వాచ్‌లోనే కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవడం, కాల్ హిస్టరీ చూసుకోవడం, డయల్ ప్యాడ్ ద్వారా కొత్త నంబర్‌కు కాల్ చేయడం లాంటి ఫీచర్లు అన్నీ ఉన్నాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌ల నోటిఫికేషన్లు కూడా నేరుగా వాచ్ స్క్రీన్ పైనే చదువుకోవచ్చు.

హెల్త్ ట్రాకింగ్,వాయిస్ అసిస్టెంట్:

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో లేటెస్ట్ సెన్సార్లను వాడారు. 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలిచే SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే మొబైల్ తీయకుండానే గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని వాయిస్ కమాండ్స్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అదనంగా మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్ కంట్రోల్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.

Also Read: రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

బ్యాటరీ లైఫ్, ఫైనల్ వర్డిక్ట్:

ఇన్ని ఫీచర్లు ఉన్నప్పుడు బ్యాటరీ తొందరగా అయిపోతుందేమో అని భయపడాల్సిన పనిలేదు. సాధారణ వాడకంపై ఈ వాచ్ ఈజీగా 5 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే 2 నుంచి 3 రోజులు వస్తుంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వర్షంలో తడిసినా, చెమట పట్టినా వాచ్‌కు ఏమీ కాదు.

కేవలం రూ. 1699 బడ్జెట్‌లో అమోలెడ్ స్క్రీన్, కాలింగ్ ఫీచర్, బ్రాండ్ వ్యాల్యూ ఉన్న స్మార్ట్‌వాచ్ కావాలంటే.. ‘ఫైర్-బోల్ట్ ఆక్సియమ్ 2026’ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు! ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ వాచ్‌లలో ఇది అగ్రస్థానంలో ఉంది.

Related News

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!

Big Stories

Advertisement
×