E-Paper
Advertisement

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!
Advertisement

Crazy Kalyanam Movie:హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) నుండి వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం క్రేజీ కళ్యాణం. యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉద్దెమరి, వీకే నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.

క్రేజీ కళ్యాణం నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఉత్సాహభరితమైన “కాకా ధూమ్ ధమాకా” అనే పాట లిరికల్ సాంగును విడుదల చేశారు. సాంప్రదాయ వివాహ ఊరేగింపులో చేసే సామూహిక నృత్య భంగిమలతో నిండిన ఒక ఉత్సాహభరితమైన వివాహ వేడుక పాటను ఇది సూచిస్తోంది . సురేష్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం అందించారు. పండగ వాతావరణంతో సంగీత ప్రియులను ఈ పాట అలరిస్తోంది. అంతే కాదు యూట్యూబ్లో వైరల్ గా మారింది. మరి ఈ పాట ఊరు వాడ మారుమ్రోగిపోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Advertisement

also read:బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..

పెళ్లి కోసం కలలు కనే అమ్మాయి కీర్తి పాత్రలో అనుపమ నటిస్తుండగా.. ఆమె తండ్రి పాత్రలో వీకే నరేష్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన టీజర్ లో పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే కూతురు.. కూతురికి ఎలాగైనా పెళ్లి చేయాలనే తపన తండ్రిది.. తన అన్నయ్యకు దరిద్రపు అల్లుడు రావాలని కోరుకునే తమ్ముడు.. ఇలా సరదా సన్నివేశాల మధ్య ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీతో కడుపుబ్బా నవ్వించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ గ్యారెంటీ అంటూ మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు.

స్టార్ స్టేటస్ లభిస్తుందా?

Advertisement

ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ.. ఈమధ్య గ్లామర్డోస్ పెంచేసింది. డ్రాగన్ సినిమాలో అందరి దృష్టిని ఆకట్టుకొని.. తన బోల్డ్ నెస్ తో సంచలనం సృష్టించిన ఈమె.. ఆ తర్వాత కిష్కింధపురి సినిమాలో దెయ్యంగా మారి భయపెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన బైసన్ , పరదా చిత్రాలు ఆకట్టుకున్నాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకు గుర్తింపును అందివ్వలేదు . మరి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ క్రేజీ కళ్యాణం ఈమెకు మంచి స్టేటస్ అందివ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

Related News

అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

‘ఎపిక్’కు ఫస్ట్ డేనే షాక్.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్

80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

ఇక సినిమాలకు ట్రైలర్స్ అవసరం లేదా? నాని నిర్ణయంతో కొత్త చర్చ!

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×