Fire-Boltt Rise Smartwatch: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్‌ల.. వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కేవలం సమయం చూసుకోవడమే కాకుండా.. ఆరోగ్య వివరాలను ట్రాక్ చేయడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, స్టైలిష్ లుక్ కోసం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌వాచ్‌లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో.. అందుబాటులో.. ఉన్న అనేక బ్రాండ్లలో ‘ఫైర్-బోల్ట్’ సంస్థ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీచర్లను అందించడంలో ఈ బ్రాండ్ ముందుంటుంది. అలాంటి అద్భుతమైన ఫీచర్లతో.. వచ్చిన సరికొత్త మోడలే ఇది. ఈ స్మార్ట్ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ విషయానికి వస్తే..ఇది చూడటానికి చాలా ప్రీమియంగా..ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో.. పెద్దదైన 47 మిమీ (1.85 అంగుళాల) HD డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎండలో బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు.. స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి తోడు వాచ్ పక్కన ఇచ్చిన రోటేటింగ్ క్రౌన్ దీనికి మరింత అందాన్ని తెస్తుంది. ఈ రొటేటింగ్ నాబ్ ద్వారా.. మీరు మెనూను ఈజీగా నావిగేట్ చేయెచ్చు. వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. దీని మెటాలిక్ బాడీ వాచ్‌కు స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
ప్రస్తుత స్మార్ట్ వాచ్‌లలో అత్యంత డిమాండ్ ఉన్న ఫీచర్ బ్లూటూత్ కాలింగ్.ఈ వాచ్ ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫో న్‌ను వాచ్‌కి కనెక్ట్ చేసి నేరుగా.. వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. ఇందులో.. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఆప్షన్ ఉంది. దీని వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ.. చాలా బాగుంటుంది. అలాగే.. మీరు తరచుగా మాట్లాడే.. కాంటాక్ట్‌లను సింక్ చేసుకోవచ్చు, రీసెంట్ కాల్ లాగ్స్ చూసుకోవచ్చు . అంతే కాకుండా డయల్ ప్యాడ్ సహాయంతో నేరుగా నంబర్ డైల్ చేసి మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. పాకెట్ నుంచి ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగ పడుతుంది.
ఆరోగ్య స్పృహ ఉన్న వారికి ఈ స్మార్ట్ వాచ్ ఒక చక్కటి మిత్రుడిలా పనిచేస్తుంది. ఇందులో.. రకరకాల హెల్త్ సెన్సార్లు ఉన్నాయి. ముఖ్యంగా 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ , SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్) ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా, మహిళల ఆరోగ్య రక్షణ కోసం.. ప్రత్యేకమైన పీరియడ్ ట్రాకర్ ఫీచర్‌ను కూడా ఇందులో ఉపయోగించారు.
మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి.. ఇందులో.. స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా వంటి వివిధ వ్యాయామాలను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఐపి రేటింగ్ అవకాశం ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. సాధారణ వాడకంలో ఇది చాలా రోజుల పాటు పని చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను నిరంతరం వాడితే బ్యాటరీ కొద్దిగా త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ రోజువారీ అవసరాలకు ఇది మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
Also Read: భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!
ఈ వాచ్‌ను మీ ఫోన్‌కి కనెక్ట్ చేయడం ద్వారా.. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ఎస్ఎంఎస్ వంటి అన్ని రకాల సోషల్ మీడియా నోటిఫికేషన్లను నేరుగా.. వాచ్ స్క్రీన్ మీదే చూసుకోవచ్చు. వీటితో.. పాటు అలారం, స్టాప్ వాచ్, వెదర్ అప్‌డేట్స్, మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి అనేక రకాల అదనపు ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో పెద్ద డిస్‌ప్లే, రోటేటింగ్ క్రౌన్, బ్లూటూత్ కాలింగ్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టైల్ ,టెక్నాలజీ కలబోతగా వచ్చిన ఈ వాచ్, మీ రోజు వారీ జీవితాన్ని మరింత ఈజీ చేస్తుంది.