E-Paper
Advertisement

రూ.30 వేలలోపు బెస్ట్ 4K క్యూఎల్ఈడీ టీవీ ఇదే..ఫీచర్లు చూస్తే షాకవుతారు!

రూ.30 వేలలోపు బెస్ట్ 4K క్యూఎల్ఈడీ టీవీ ఇదే..ఫీచర్లు చూస్తే షాకవుతారు!
Advertisement

Wobble X Series 50 inch QLED TV: ప్రస్తుత కాలంలో.. ఇంటి నిండా హోమ్ థియేటర్ ఫీల్ పొందాలని కోరుకునే.. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో ..అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. అందించే స్మార్ట్ టీవీల కోసం..కస్మటర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసంజజ మార్కెట్లోకి వచ్చిన అద్భుతమైన స్మార్ట్ టీవీ ఇది. కేవలం రూ.28,899 ధరకే.. లభిస్తున్న ఈ టీవీ, తన అద్భుతమైన ఫీచర్లతో.. టెక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్ ,డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, బెజెల్‌లెస్ డిజైన్‌తో వస్తుంది. ఇది మీ లివింగ్ రూమ్‌కు మోడర్న్ లుక్‌ను అందిస్తుంది. ఇందులో.. ఉన్న 127 సెం.మీ (50 అంగుళాల) క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే వీక్షణ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది.క్యూఎల్ఈడీ  టెక్నాలజీ కారణంగా రంగులు చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. దీనికి తోడు డాల్బీ విజన్, MEMC టెక్నాలజీలు ఉన్నాయి. దీనివల్ల వేగంగా కదిలే యాక్షన్ సీన్స్ లేదా స్పోర్ట్స్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు ఎలాంటి బ్లర్ లేకుండా.. చాలా స్మూత్‌గా కనిపిస్తాయి.

అద్భుతమైన ఆడియో ఫీల్:

Advertisement

సాధారణంగా స్మార్ట్ టీవీలలో సౌండ్ క్వాలిటీ కోసం.. ప్రత్యేకంగా సౌండ్‌ బార్‌లు కొనాల్సి ఉంటుంది. కానీ.. ఈ టీవీ ఈ విషయంలో ..ప్రత్యేకంగా నిలుస్తుంది.ఇది ఏకంగా 80W (80 వాట్స్)పవర్ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. దీనికి తోడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల ఇంట్లోనే.. థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ పొందొచ్చు. సినిమాలు చూసేటప్పుడు.. లేదా పాటలు వినేటప్పుడు బేస్, వాయిస్ క్లారిటీ అద్భుతంగా ఉంటాయి.

గేమింగ్ లవర్స్‌కు ప్రత్యేక ఫీచర్లు:

కేవలం మూవీ లవర్స్కే కాకుండా, గేమర్స్‌ను కూడా ఈ టీవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో.. ALLM, 120Hz VRRసపోర్ట్ అందించారు. దీని వల్ల ప్లేస్టేషన్ లేదా ఎక్స్-బాక్స్ వంటి కన్సోల్స్‌తో గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా, స్క్రీన్ టేరింగ్ సమస్యలు రాకుండా ..అల్ట్రా-స్మూత్ గేమింగ్ ఫీల్ లభిస్తుంది. గేమింగ్ లవర్స్‌కు ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగా ఒక గొప్ప ఆప్షన్ అనే చెప్పొచ్చు.

గూగుల్ టీవీ:

Advertisement

ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా , యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూ ట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.దీనిలో బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం ద్వారా వాయిస్ కమాండ్స్ ద్వారానే.. టీవీని కంట్రోల్ చేయెచ్చు. అలాగే దీనిలోని క్రోమ్‌కాస్ట్ ఆప్షన్ ద్వారా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

కనెక్టివిటీ ఆప్షన్స్:

ఈ టీవీలో బహుళ కనెక్టివిటీ ఆప్షన్లు.. అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్‌లను కనెక్ట్ చేయడానికి అవసరమైన HDMI పోర్ట్‌లు, పెన్‌ డ్రైవ్‌ల కోసం USB పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ అవకాశం ఉంది.

ధర:

మార్కెట్లో లభిస్తున్న ఇతర బ్రాండ్ల క్యూఎల్ఈడీ టీవీలతో పోలిస్తే, రూ.28,899 ధరకే ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు అందించడం చాలా గొప్ప విషయం. తక్కువ బడ్జెట్‌లో… ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ టీవీ ఒక చక్కటి ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పొ చ్చు.

Related News

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు, ఇబ్బందుల్లో లక్షలాది మంది

పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

చంద్రుడి దూళితో ఇటుకలు.. సిమెంట్ అవసరం లేదట, ఎలా నిర్మిస్తారంటే?

భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

Big Stories

Advertisement
×