Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నిండింది. అసలు పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో మనం ఒక్కసారి చూద్దాం..
పార్టీలకు అతీతంగా పంచాయతీ పోరు
మన ఊరి పాలనకు పునాది అయిన గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలన్నదే అసలు ఉద్దేశం. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే ప్రజల మధ్య నుంచి వచ్చే వ్యక్తులకు అవకాశం దక్కాలి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా నామినేషన్ వేసి, బరిలోకి దిగే హక్కు ఉంటుంది.
స్వేచ్ఛగా పోటీ చేయొచ్చు
ఈసారి ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, అలాగే వీర మహిళలు ఎవరైనా సరే స్వేచ్ఛగా నామినేషన్లు వేయొచ్చని పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఆంక్షలు లేవు. ఆసక్తి ఉన్న ప్రతి కార్యకర్త తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన స్పష్టం చేశారు.
సీట్ల పంపకాలు లేవు.. అడ్డుకోవద్దు
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు లేదా సర్దుబాట్లు జరిగినట్టు పంచాయతీ ఎన్నికల్లో అస్సలు ఉండవని పవన్ గారు ఖరాకండిగా చెప్పారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను పార్టీ నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని ఆయన గట్టిగా ఆదేశించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ట్వీట్ చేస్తూ.. పంచాయతీ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం