BigTV English

OnePlus V Flip : ఫ్లిప్ ఫోన్ మార్కెట్లోకి మరో సరికొత్త మెుబైల్.. త్వరలోనే లాంఛ్ చేయబోతున్న వన్ ప్లస్

OnePlus V Flip : ఫ్లిప్ ఫోన్ మార్కెట్లోకి మరో సరికొత్త మెుబైల్.. త్వరలోనే లాంఛ్ చేయబోతున్న వన్ ప్లస్

OnePlus V Flip : మార్కెట్‌లో మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్స్ (Foldable SmartPhone) కు రోజు రోజుకూ పోటీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్‌ గట్టి పట్టు సాధించింది. మోటోరోలా సహా ఇతర కంపెనీలు కూడా ఫోల్డబుల్‌ ఫోన్లను తీసుకువచ్చాయి. అయితే ఫోల్డబుల్​ ఫోన్లలో ఈ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే దిశగా ముందుకెళ్తోంది గ్లోబల్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ ప్లస్‌. ఫోల్డబుల్‌ ఫోన్లలో కస్టమర్లకు ఇప్పటి వరకు మార్కెట్‌లో లేని ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే తమ సంస్థ నుంచి ఫోల్డబుల్​ స్మార్ట్​ ఫోన్ల లైనప్​ను ఎక్స్​ప్యాండింగ్​ చేసే దిశగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సరికొత్త మడతపెట్టే స్మార్ట్​ ఫోన్లను గ్యాడ్జెట్స్​ లవర్స్​కు అందించేందుకు సిద్ధమైంది.


త్వరలోనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంఛ్ – ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌. త్వరలో మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ తీసుకురాబోతోంది. ఫస్ట్ క్లామ్​షెల్ స్టైల్​ ఫోల్డబుల్​ స్మార్ట్ ఫోన్​ను ఆవిష్కరించనుంది. వన్​ప్లస్​ వీ ఫ్లిప్​ పేరుతో దీనిని తీసుకురానుంది. ఈ విషయాన్ని డిజిటల్ చాట్​లో చైనీస్​ టిప్​స్టర్​ షేర్ చేసింది. అలానే ఈ కొత్త స్మార్ట్ ఫోన్​ లాంఛ్ టైమ్​లైన్​, దాని స్పెసిఫికేషన్స్​ను కూడా తెలిపింది. ఈ సందర్భంగా OnePlus V Flip గురించి తెలుసుకుందాం.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్​ప్లస్.. తన ఫ్లిప్​ ఫోన్ ను​ వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేయనుందట. 2025 ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్యలో లాంఛ్ చేస్తుందట. అయితే ఈ ఫోన్​ ఒప్పో ఫైండ్​ ఎన్​ 5 ఫ్లిప్​కు రీబ్రాండెడ్​ వెర్షన్​ అనే రూమర్స్​ కూడా వచ్చాయి. అయితే దీన్ని కొంతమంది కొట్టి పారేయగా మరి కొంతమంది చెప్పలేం అని అంటున్నారు. ఏదేమైనా ఈ వన్​ ప్లస్​ వీ ఫ్లిప్ (OnePlus V Flip)​ విడుదలైతే శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్ (Samsung Galaxy Z Flip) ​, మోటొరోలా Razr ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ (Motorola razr 40 Ultra 5G) తో పోటీ పడుతుంది.


వన్ ప్లస్​ వి ఫ్లిప్​తో పాటు వన్​ ప్లస్​ ఓపెన్ 2 స్మార్ట్ ఫోన్​ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట. వనప్లస్‌ ఇప్పటికే ఓపెన్‌ మోడల్ ఫోల్డబుల్​ ఫోన్​ను తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇదే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఓపెన్ 2 మోడల్​ను తీసుకురానుందని తెలిసింది. దీనిని 2025 ప్రారంభంలో విడుదల చేయొచ్చని సమాచారం. హార్డ్​వేర్ అప్డేట్​తో దీని మార్కెట్​లోకి విడుదల చేయనుంది. స్మాప్ ​డ్రాగన్​ 8 ఎలైట్​ చిప్​సెట్​తో ఇది రానుంది. అలానే ట్రిపుల్ కెమెరా సెటప్​ను ఇవ్వనున్నరని తెలిసింది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్స్​, ఆప్టికల్ జూమ్​తో పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్​ 5700mAh బ్యాటరీ కెపాసిటీతో రానుంది. మొత్తంగా వన్ ప్లస్​.. 2025 కోసం తమ ఫోల్డబుల్​ స్మార్ట్ ఫోన్ల తయారీ విషయంలో పెద్ద ప్లాన్​తోనే ఉందని తెలుస్తోంది.

ALSO READ : ఇన్​స్టాగ్రామ్ నుంచి బ్రేక్ కావాలా.. మరి మీ డేటాను ఇలా సేవ్ చేసేసుకోండి

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×