Mobile Offers : ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో అధునాతన మెుబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గూగుల్.. ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ మెుబైల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ మెుబైల్స్ పై ఫ్లిప్కార్ట్ లో ఆఫర్స్ అదిరేలా ఉన్నాయి.
Apple, Samsung వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు AI, కెమెరా ఫీచర్స్ తో హై స్టాండర్డ్ మెుబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో… Google సైతం తన స్పీడ్ ను పెంచినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే పిక్సెల్ 9 ను లాంఛ్ చేసిన గూగుల్.. తాజాగా పిక్సెల్ 10, పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్స్ ను లేటెస్ట్ అప్డేట్స్ తో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. బెస్ట్ కెమెరా, AI లో ఊహించిన అప్‌గ్రేడ్స్ తో త్వరలోనే వీటిని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తన పాత మోడల్ మెుబైల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇక తాజాగా గూగుల్ పిక్సెల్ 8 మెుబైల్ పై అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చేసింది.
గూగుల్ పిక్సెల్ 8 ఇండియాలో రూ.75,999 ధరతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.48,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఇక ఈ మెుబైల్ పై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ సైతం ఫ్లిప్కార్ట్ అందిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయలనుకుంటున్నారా? స్మార్ట్ ప్రియులకు ఇదే కరెక్ట్ టైమ్. Google Pixel 8పై ఫ్లిప్‌కార్ట్ భారీ రూ. 27,000 తగ్గింపును అందిస్తోంది. ఇక ఈ ప్రీమియం మెుబైల్ ను గతంలో కంటే తక్కువ రేటుకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇలాంటి ఆఫర్స్ అరుదు. దీంతో స్మార్ట్ ఫోన్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి.
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.75,999కి ప్రారంభించబడింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఈ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.48,999కే అందిస్తోంది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా చేయడానికి, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
Google Pixel 8 Features –
Google Pixel 8 6.2 అంగుళాల FHD + OLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ డిస్ ప్లే 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇంకా, Pixel 8 హ్యాండ్‌సెట్ Google Tensor G3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం Google Pixel 8 మెుబైల్ కు బ్యాక్ సైడ్ రెండు కెమెరా సెన్సార్స్ ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 10.5MP షూటర్ అందుబాటులో ఉన్నాయి. Google Pixel 8 స్మార్ట్‌ఫోన్ లో 4575mAh బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని ఫీచర్స్ ఈ మెుబైల్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. యూజర్స్
ALSO READ : కోట్లలో డీప్‌సీక్ డౌన్లోడ్స్.. సరే కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?