BigTV English

Google Pixel 8a Flipkart: గూగుల్ పిక్సెల్ 8ఏ పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకు!

Google Pixel 8a Flipkart: గూగుల్ పిక్సెల్ 8ఏ పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకు!

Google Pixel 8a Flipkart offer| గూగుల్ స్మార్ట ఫోన్ లలో పిక్సెల్ 9 సిరీస్ ఇటీవల ఇండియాలో కొత్త మాడల్స్ లాంచ్ అయ్యాయి. కొత్తగా లాంచ్ అయిన పిక్సెల్ 9 సిరీస్ లో Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL ఉన్నాయి. అయితే కొత్త పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ తరువాత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పాత పిక్సెల్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Google Pixel 8 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ పై రూ.55000 లోపు అందుబాటులో ఉంది.


సాధారణంగా గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ తరువాత తన ఫ్లాగ్ షిఫ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు అందబాటులోకి తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మే నెలలో, గూగుల్ తన పిక్సిల్ 8ఏ మాడల్స్ ను తక్కువ ధరలో ఉండేవిధంగా ఒక వేరియంట్ తీసుకొచ్చింది. 2025లో గూగుల్ పిక్సెల్ 9ఏ లాంచ్ చేయనుందని సమాచారం.

అయితే Google Pixel 9a లాంచ్‌కు ముందు, ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్లకు అందిస్తోంది. 2024 మే 7న లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ 128 వేరియంట్ ప్రారంభ ధర రూ.52999 కాగా, 256GB వేరియంట్‌ ధర రూ. 59,999.


Google Pixel 8a డిస్కౌంట్ ధర
తాజాగా ఫ్లిప్ కార్ట్ గూగుల్ పిక్సెల్ 8ఏ 128జిబి వేరియంట్ పై రూ.3000 డిస్కౌంట్ తో రూ.49,999 కు అందిస్తోంది. పైగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.4000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే గూగుల్ పిక్సెల్ 8ఏ 128జిబి వేరియంట్ ధర ఇక కేవలం రూ.45999 మాత్రమే. ఇవే కాకుండా స్మార్ట్ ఫోన్ ఎక్సెఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ కుమ్ముడు.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్.. ఈ సారి తగ్గేదే లే..!

Google Pixel 8a ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ 8ఏ లో 1080 x 2400, 430 PPI రెజల్యూషన్ తో 6.1 ఇంచులు ఓటెడ్ ఆక్టువా డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్ 120 Hz, డిస్ ప్లే సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చబడి ఉంటుంది. స్క్రీన్ బ్రైట్ నెస్ 2000 యూనిట్ల వరకు ఉంటుంది.

గూగుల్స్ టెన్ సర్ జి3 చిప్ సెట్, టైటాన్ సెక్యూర్టీ కోప్రాసెసర్ ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఇందులో GB LPDDR5x ర్యామ్ కూడా ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ఏ లో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలోని కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 8 ఏ స్మార్ట్ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ లెన్స్, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ లో వైడ్ వ్యూ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.

Also Read:  Flipkart New Sale: ఆఫర్ల జాతర వచ్చేస్తుంది.. ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్, తగ్గేదే లే..!

Related News

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి

Whatsapp Guest Feature: అకౌంట్ లేకుండానే వాట్సాప్ మేసేజ్ పంపించవచ్చు.. ఎలాగంటే?

Samsung Truck Stolen: రూ 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ.. 12000 శామ్‌సంగ్ డివైస్‌లు ఉన్న ట్రక్కు మాయం

Big Stories

×