BigTV English

Allu Arjun: పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ బన్నీ ట్వీట్

Allu Arjun: పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ బన్నీ ట్వీట్

 


Allu Arjun extends his birthday greetings to Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్’. అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎన్నిక సమయంలో మొదలైన అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బన్నీ ట్వీట్ విశేషంగా మారింది.

ఇటీవల, ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అంతకుముందు ఎన్నికల సమయంలో మొదలైన వివాదం.. మళ్లీ ఆ తర్వాత పలు కామెంట్ చేయడంతో రాజుకుంది. దీంతో జనసేన నాయకులు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో సినిమాలు ఎలా ఆడుతాయో చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. దీంతో అల్లు అర్జున్ మరో కామెంట్ చేశాడు.


తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి వెనకాడను అంటూ కామెంట్ చేశాడు. అయితే ఎప్పుడైతే.. బన్నీ ‘చెప్పను బ్రదర్’ అని ఓ కామెంట్ చేయడంతో మొదలైన ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా, పవన్ కల్యాణ్ కు బన్నీ బర్త్ డే విషెస్ చెప్పారు. కనీసం ఈ విషెస్ చెప్పడంతోనైనా ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.

Also Read:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. మీకు తెలియని విషయాలు..

ఇదిలా ఉండగా, ఈ ఏడాది పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. ‘జెండా పట్టిన జనసైనికులకు, నమ్మి నడిచిన నాయకులకు నువ్వొస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది. ఉన్నత విలువలు ఉన్నవాడు డిప్యూటీ సీఎంగా చేసుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావున మరీ ప్రత్యకం. నిండు నిరూళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని’. అంటే ట్వీట్ చేశారు.

అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో మరిన్న అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆక్ష్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘మీ అంకితభావంతో కూడిన సేవ ఏపీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రజలకు సేవ చేస్తూనే మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×