Apple Foldable iPhone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple) త్వరలోనే ఫోల్డబుల్ మొబైల్ (Foldable Mobiles) ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఐఫోన్ 18 సిరీస్ (iphone 18 Series) తో పాటు సెప్టెంబర్ 2026లో ఈ మొబైల్ లాంఛ్ కాబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కొరియన్ వార్తా సంస్థ టిప్ స్టర్ (Tipstar) తన నివేదకలో తెలిపింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలన్నీ ఇప్పటికే ఫోల్డబుల్ మొబైల్స్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. సామ్ సాంగ్ సిరీస్ లో వచ్చేసిన ఫోల్డబుల్ మొబైల్స్ కు ఉన్న క్రేజ్ కూడా అంతా కాదు. అయితే ఆపిల్ కూడా ఇప్పటికే పోల్డబుల్ మొబైల్స్ ను తీసుకురానుందని వార్తలు హల్చల్ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ మొబైల్ లాంఛ్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఐఫోన్ 18 సిరీస్ సెప్టెంబర్ 2026 లో లాంఛ్ కాబోతున్న నేపథ్యంలో అప్పుడే ఈ ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పోల్డబుల్ ఐఫోన్స్ పై యాపిల్ సన్నాహాలు చేస్తుంది. డిజైన్, ప్రాసెసర్, ఫీచర్స్ తో అదిరిపోయే మెుబైల్ ను తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే రాబోతున్న యాపిల్ ఫోల్డబుల్.. సామ్సాంగ్, మోటోరోలా ఫాల్డబుల్ మొబైల్ కు గట్టి పోటీ ఇవ్వనున్నట్టే తెలుస్తుంది.
ఫీచర్స్ –
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ Samsung మెుబైల్స్ లో ఉండే OLED డిస్‌ప్లేలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బుక్-స్టైల్ డిజైన్ తో ప్రతీ ఏటా 15 – 20 మిలియన్ ఫోల్డబుల్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మెుబైల్ ను టాబ్లెట్ లా ఉపయోగించేందుకు పెద్ద స్క్రీన్ తో పాటు పోల్డబుల్ మొబైల్ లో ఉపయోగించేందుకు చిన్న స్క్రీన్ సైతం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది మేలో ఆపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్‌ను తయారీ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. డిజైన్ పరంగా, iPhone ఫోల్డబుల్ మెుబైల్ Galaxy Z Fold సిరీస్‌ను పోలి ఉంటుందని అంచనా. ఇది ఒక బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. అయితే ఈ ఫోన్ ను టాబ్లెట్ లా ఉపయోగించేందుకు పెద్ద స్క్రీన్ తో పాటు పోల్డబుల్ మొబైల్ లా ఉపయోగించేందుకు చిన్న స్క్రీన్ సైతం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే మార్కెట్లో లాంఛ్ అయిన ఫోల్డబుల్ మొబైల్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా యాపిల్ సన్నాహాలు చేస్తుంది. ప్రతీ ఏటా 15 నుంచి 20 మిలియన్స్ ఫాల్డబుల్ మొబైల్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సామ్ సాంగ్ లో ఉపయోగించే OLED డిస్ ప్లేను ఉపయోగించటంతో మార్కెట్లో సామ్ సాంగ్ తో పోటీ పడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు యాపిల్ కంపెనీ తన ఫోల్డబుల్ మొబైల్స్ పై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. త్వరలోనే రెండు ఫాలో ఫోల్డబుల్ మొబైల్స్ ను తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
ALSO READ : ఏంటి భయ్యా ఇది… ఐక్యూ కొత్త మెుబైల్ పై ఏకంగా రూ.25వేల డిస్కౌంటా!