BigTV English

PhD Student Suicide : డబ్బులు కోసం ఓ కానిస్టేబుల్ వేధింపులు.. ఉరేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య

PhD Student Suicide : డబ్బులు కోసం ఓ కానిస్టేబుల్ వేధింపులు.. ఉరేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య

PhD Student Suicide : కుటుంబానికి దూరంగా ఉంటున్న తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్, అతని భార్య చేస్తున్న ఒత్తిడి భరించలేక ఓ పీహెచ్ డీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. తనకు సంబంధం లేని విషయంలో ఛీటింగ్ కేసు పెట్టి వేధిస్తుండడంతో తీవ్ర మనోవేధనకు గురై, చున్నీతో ఉరేసుకుని దీప్తి అనే యువతి చనిపోయింది. ఆత్మహత్యకు ముందు ఆమె సెల్ఫీ వీడియో బయటకు రావడంతో.. సంచలనంగా మారింది.


హైదరాబాద్ లోని నాచారం బాపూజీనగర్ సరస్వతీ కాలనీకి చెందిన పులివర్తి దీప్తి (28).. హబ్సీగూడలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – (ఐఐసీటీ) లో ప్రాజెక్టు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి సంగీత రావు కూడా గతంలో ఇదే సంస్ధలో పనిచేశారు. ప్రస్తుతం రిటైర్డ్ మెంట్ అయ్యారు. కానీ.. కుటుంబానికి చాన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం దీప్తి, ఆమె తల్లి మాత్రమే ఉంటున్నారు. మంచి చదువుతో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కుమార్తెకు తండ్రి గతంలో చెేసిన అప్పు శాపంగా మారింది.

సంగీతరావు ఐఐసీటీలో పనిచేస్తున్నప్పుడు బెల్లా అనిల్ అనే ఓ కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. దాంతో.. అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మంచి.. అనిల్ దగ్గర సంగీతరావు రూ.15 లక్షల రూపాయాలు తీసుకున్నారు. కానీ చాన్నాళ్లుగా ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో.. అనిల్, అతని భార్య అనిత.. తరచు డబ్బుల కోసం దీప్తిని ఇబ్బంది పెడుతున్నారు. అనేక సార్లు ఆమెను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి  తెచ్చారు.


అనిల్ అడిగిన ప్రతీసారి తన తండ్రి తమతో  ఉండడం లేదని, తనకు ఆ డబ్బులు కట్టే స్తోమత లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. డబ్బులు ఇవ్వాల్సిందే అని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే నాచారం ఠాణాలో అనిల్ తన భార్య అనితతో ఫిర్యాదు చేయించాడు. దీప్తి, ఆమె తండ్రి సంగీతరావు లపై ఛీటింగ్ కేసు నమోదైంది. మరోవైపు కోర్టులో సివిల్ దావా సైతం వేశారు. దీంతో.. సంబంధం లేని విషయంలో తనను ఇరికించారని ఆవేదన చెందిన దీప్తి.. మనస్థాపానికి గురైంది. దీంతో.. బుధవారం రాత్రి 10 గంటలకు తన గదిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దీప్తి తల్లి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయాన్ని పోలీసులకు చేరవేయగా.. వారు ఆమె ఫోన్ తనిఖీ చేయగా.. ఓ సెల్ఫీ వీడియో ఉంది. అందులోని విషయం ఆధారంగా.. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు.

సెల్పీ వీడియోలో దీప్తి ఏమన్నది

సెల్పీ వీడియోలో దీప్తి తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన మరణానికి అనిల్, అతని భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని వెల్లడించింది. తన తండ్రి డబ్బు తీసుకుంటే తన మీద కేసు పెట్టి, జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆ కేసుల మీద పోరాడే శక్తి లేదని, తన మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీరు పెట్టింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్షపడాలని కోరుకున్న దీప్తి.. చావులోనూ మానవత్వాన్ని చాటుకుంది. తన మృతదేహానికి కాల్చేయవద్దని, వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కోరుకుంది.

 Also Read : ఓ అవ్వా తాతల కన్నీటి గాథ.. జీవితాంతం పడిన కష్టం క్షణాల్లో అగ్నికి ఆహుతైంది..

ఈ వీడియో ఆధారంగా దీప్తి తల్లి పోలీసు ఫిర్యాదు చేయడంతో..  పోలీసులు కేసు నమోదు చేసి దీప్తి మృతికి కారణమైన వాళ్లపై కేసులు పెట్టిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×