PHILIPS 20000 mAh power bank review: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ పేమెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ప్రతీ దానికీ ఫోనే ఆధారం. రోజంతా ఫోన్ విపరీతంగా వాడటం వల్ల.. సగం రోజూ గడవక ముందే.. బ్యాటరీ అయిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా బయట ప్రయాణాలు చేసే సమయంలో.. ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ టెన్షన్‌కు చెక్ పెట్టడానికి ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ ఫిలిప్స్.. సరి కొత్తగా PHILIPS 20000 mAh 22.5W పవర్ బ్యాంక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం రూ.1,599 ధరకే లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఈ పవర్ బ్యాంక్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా , ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఇందులో.. ఇచ్చిన ‘డీప్ సియాన్’ కలర్ ఆప్షన్ దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. 20000 mAh భారీ బ్యాటరీ.. అయినప్పటికీ, దీని సైజ్ , షేప్ చాలా చక్కగా డిజైన్ చేసారు. దీన్ని మీ బ్యాగ్‌లో లేదా ట్రావెల్ పౌచ్‌లో ఈజీగా సర్దుకోవచ్చు. ఫిలిప్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని బిల్డ్ క్వాలిటీ.. కూడా చాలా స్ట్రాంగ్‌గా, క్వాలిటీ ఉంటుంది.
ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని ఛార్జింగ్ వేగం. ఇందులో.. 22.5W హై-స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ సమయంలోనే.. వేగంగా ఛార్జ్ అవుతుంది. మీరు ఆఫీస్ పనిలో.. బిజీగా ఉండి, అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. మీకు ఎంతగానో సహాయ పడుతుంది. కేవలం మొబైల్స్ మాత్రమే.. కాకుండా టాబ్లెట్లు, వైర్‌లెస్ ఇయర్ బడ్స్, ఇతర స్మార్ట్ గాడ్జెట్‌లను కూడా దీని ద్వారా సురక్షితంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
తరచూ ప్రయాణాలు చేసే వారికి మరియు రెండు మూడు రోజుల పాటు.. ఛార్జర్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ 20000 mAh బ్యాటరీ కెపాసిటీ ఒక వరం లాంటిది. సాధారణ స్మార్ట్ ఫోన్‌లను ఇది ఈజీగా 4 నుంచి 5 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అంటే.. ఒక్క సారి పవర్ బ్యాంక్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకుంటే.. రోజంతా బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా.. ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే.. ఇందులో ఉన్న మల్టిపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్ మీ డివైజెస్‌ను ఓవర్-చార్జింగ్, ఓవర్-హీటింగ్, షార్ట్ సర్క్యూట్ల నుంచి సురక్షితంగా కాపాడుతుంది.
Also Read: గోద్రెజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్..రూ.10వేలకే!
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర రూ. 1,599 గా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ స్టోర్లలో ఇది కొనడానికి అందుబాటులో ఉంది.కేవలం రూ.1600 బడ్జెట్‌లో.. ఫిలిప్స్ లాంటి నమ్మదగిన బ్రాండ్ నుంచి 20000 mAh కెపాసిటీ ,22.5W ఫాస్ట్ ఛార్జింగ్ లభించడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు తరచూ ప్రయాణాలు చేస్తూ..ఒక స్టైలిష్, పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే పిలిప్స్ పవర్ బ్యాంక్ మీకు నూటికి నూరు శాతం సరి పోతుంది.