Rohit – Kohli: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (New Zealand vs India, 1st ODI) మధ్య తొలి వన్డే ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇద్దరు ఫీల్డింగ్ లో అదరగొడుతున్నారు. ఆక్లాండ్ వేదికగా (Eden Park, Auckland) జరుగుతున్న ఈ తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ అదిరిపోయే ఫీల్డింగ్ చేసి ఓ రనౌట్ చేశాడు. జాంటీ రోడ్స్ ను మైమరిపించేలా డైవ్ చేసి మరీ అందరిని ఆకట్టుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ కూడా ఏ మాత్రం తగ్గలేదు.
స్లిప్పులో ఉన్న విరాట్ కోహ్లీ.. సూపర్ మ్యాన్ లా డైవ్ చేసి ఓ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు 40 ఏళ్ల వయసులోనూ న్యూజిలాండ్ జట్టుకు సినిమా చూపిస్తున్నారని రియాక్ట్ అవుతున్నారు. ఎవడ్రా వీళ్లు ముసలోళ్లు అయ్యారని అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కాదు, మరో 10 ఏళ్లు టీమిండియాలోనే రోహిత్, కోహ్లీ కొనసాగాలని కోరుతున్నారు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కుర్రాడిలా డ్రైవ్ చేసి రనౌట్ చేశాడు. 21వ ఓవర్ వేసేందుకు అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ క్రమంలోనే స్ట్రైకింగ్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న రోహిత్ శర్మ సూపర్ మ్యాన్ లాగా డ్రైవ్ చేసి బంతిని వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ కు అందించాడు. ఈ క్రమంలోనే మరో ఎండ్ లో ఉన్న డారిల్ మిచెల్ రనౌట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కాగా.. రోహిత్ శర్మ ఫీల్డింగ్ ను క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
న్యూజిలాండ్ ఆటగాడు స్మిత్ స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు అన్షుల్ కంపోజ్ బౌలింగ్ చేశాడు. అయితే అతన్ని ఎదుర్కునే క్రమంలో ముందు నుంచి ఇబ్బంది పడుతున్న స్మిత్.. ఆఫ్ సైడ్ వైపు పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తగిలి స్లిప్ లో ఉన్న కోహ్లీ వైపు వెళ్ళింది. దీంతో ఆ బంతిని గాల్లోకి పక్షులా ఎగిరి కోహ్లీ పట్టేసుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ చేసుకున్న సెలబ్రేషన్స్ కూడా వైరల్ గా మారాయి. రాముడు బాణం వేసినట్టుగానే అతడు కూడా విల్లు వదులుతూ రచ్చ చేశాడు. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ దాటికి 40.2 ఓవర్లలోనే 185 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది.
FLYING RUNOUT BY ROHIT SHARMA🥵😯😯
Fitnesss Level of 39 yrs old Veteran 💪 #NZvsIND #ODI #RohitSharma pic.twitter.com/OwsqqATXXG— 𝙉𝙖𝙥𝙤𝙡𝙚𝙤𝙣 🇮🇳 (@goatnapoleon) November 4, 2026
It's the King's birthday weekend, and we get the presents! 👑 🎁
Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha.#SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND | [Virat Kohli] pic.twitter.com/LffbctfFwm
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026