E-Paper
Advertisement

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్
Advertisement

GOBOULT Trail Pro smartwatch: తక్కువ ధరలోనే.. ప్రీమియం లుక్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండే.. స్మార్ట్‌ వాచ్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ వచ్చేసింది. ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ ‘బోల్ట్’విడుదల చేసిన ఈ మోడల్ టెక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 2.01 ఇంచుల 3D కర్వ్డ్ అమెలోడ్ డిస్‌ప్లేతో.. వస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్ ధర కేవలం రూ.1,649 మాత్రమే. ఈ ట్రెండీ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

3D కర్వ్డ్ డిజైన్, డిస్‌ప్లే:

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ వాచ్‌లు కేవలం సమయం చూసే యంత్రాలు కాకుండా.. చేతికి అందాన్నిచ్చే ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా మారి పోయాయి. ఇదే కోవకే..ఈ చెందిన మోడల్ చాలా స్టైలిష్‌గా, మోడరన్‌గా డిజైన్ చేసారు. ఇందులో జెట్ బ్లాక్ స్ట్రాప్ ఇచ్చారు. ఇది ఏ డ్రెస్ పైకైనా చాలా పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Advertisement

ఈ వాచ్ మెయిన్ హైలైట్ దాని స్క్రీన్. ఇందులో.. 2.01 ఇంచుల (5.11 సెం.మీ) భారీ 3D కర్వ్డ్ అమెలోడ్ డిస్‌ప్లేను  వాడారు. సాధారణ ఎల్సీడీ డిస్‌ప్లేలతో పోలిస్తే.. అమెలోడ్ స్క్రీన్ వల్ల కలర్స్ చాలా వైబ్రెంట్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ఎండలో.. బయటికి వెళ్లినా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి తోడు వాచ్‌లో.. ఏకంగా.. 250 పైచిలుకు క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ మూడ్‌కు తగినట్టుగా రోజూ ఒక కొత్త లుక్‌ను మీరు సెట్ చేసుకోవచ్చు.

స్మార్ట్ కనెక్టివిటీ , బ్లూటూత్ కాలింగ్:

ఈ బడ్జెట్ ధరలోనూ కంపెనీ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించడం విశేషం. వాచ్‌లో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ జేబులో.. ఉన్నప్పటికీ వాచ్ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. డైరెక్ట్ డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్, కాంటాక్ట్స్ సింక్ వంటి ఆప్షన్లు దీనిలో ఈజీగా పనిచేస్తాయి. అలాగే సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఈమెయిల్స్ , టెక్స్ట్ మెసేజ్‌లను నేరుగా వాచ్‌లోనే చూసుకోవచ్చు.

స్పోర్ట్స్ మోడ్స్:

Advertisement

ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఈ స్మార్ట్‌ వాచ్‌లో రకరకాల హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఉన్నాయి. నిరంతరం హార్ట్ రేట్ పర్యవేక్షించడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తెలిపే.. SpO2 మానిటర్, నిద్ర విధానాన్ని విశ్లేషించే.. స్లీప్ ట్రాకర్ వంటివి ఇందులో ఉన్నాయి. రోజువారీ నడకను లెక్కించడానికి స్టెప్ కౌంటర్ , క్యాలరీ బర్న్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు వ్యాయామం చేసేవారికి.. ఎంతగానో సహాయ పడతాయి. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ద్వారా మీ ఫిట్‌నెస్ గోల్స్‌ను ఈజీగా ట్రాక్ చేయొచ్చు.

Also Read: ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

IP68 వాటర్ రెసిస్టెన్స్, బ్యాటరీ లైఫ్:

రోజువారీ వాడకంలో నీరు లేదా చెమట తగులుతుందనే టెన్షన్ ఈ వాచ్ విషయంలో అవసరం లేదు. ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి చిన్నపాటి వర్షంలో తడిచినా లేదా వర్కవుట్.. చేసేటప్పుడు చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది జరగదు.

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చడం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో ఇది మెరుగైన బ్యాకప్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.

ధర :

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ. 1,649 మాత్రమే. కేవలం రెండు వేల రూపాయల లోపు.. బడ్జెట్‌లో 3D కర్వ్డ్ అమెలోడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ , స్టైలిష్ జెట్ బ్లాక్ డిజైన్ కోరుకునే విద్యార్థులు, ఉద్యోగులకు ఇది మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న బెస్ట్ ఛాయిస్!

Related News

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!

యూత్ ఫిదా అయ్యే లుక్ & ఫీచర్స్..మోటో కొత్త బడ్స్ లాంచ్!

Big Stories

Advertisement
×