E-Paper
Advertisement

రూ.1069కే 60H బ్యాటరీ..ఇయర్‌బడ్స్! గేమింగ్, మ్యూజిక్ కోసం బెస్ట్

రూ.1069కే 60H బ్యాటరీ..ఇయర్‌బడ్స్! గేమింగ్, మ్యూజిక్ కోసం బెస్ట్
Advertisement

GOBOULT Z40 TWS earbuds: ప్రస్తుత కాలంలో మంచి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేడ్ ఇన్ ఇండియా.. బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ ఇప్పుడు కేవలం రూ. 1069 ధరకే అందుబాటులోకి వస్తోంది. 60 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్, జెన్ ENC మైక్ , పవర్‌ ఫుల్ బేస్‌తో వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ బడ్జెట్ యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నప్పటికీ.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో ఈ ఇయర్ బడ్స్ మోడల్ ఎప్పుడూ ముందుంటుంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

GOBOULT Z40 TWS ఫీచర్లు:

డిజైన్,కలర్ :

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి.. చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఆకర్షణీయమైన బ్లూ కలర్ వేరియంట్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చెవులకు సరిగ్గా.. సరిపోయే ఇయర్‌ బడ్ డిజైన్ కారణంగా గంటల తరబడి పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. దీని కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్ పాకెట్‌లో ఈజీగా ఇమిడిపోతుంది.

సౌండ్ క్వాలిటీ & 10mm డ్రైవర్లు:

Advertisement

మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 10mm రిచ్ బేస్ డ్రైవర్లను వాడారు. దీనివల్ల పాటలు వినేటప్పుడు డీప్ బేస్, క్లియర్ వోకల్స్ చక్కగా వినిపిస్తాయి. అంతే కాకుండా మీరు ఎలాంటి జోనర్ మ్యూజిక్ విన్నా.. అద్భుతమైన ఆడియో ఫీల్ ఇస్తుంది.

Zen™ ENC మైక్ ,కాల్ క్వాలిటీ:

బయట రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం కష్టమవుతుంది. అయితే.. ఈ మోడల్ లో ఉన్న Zen™ ENC మైక్ టెక్నాలజీ వల్ల చుట్టుపక్కల శబ్దాలు తగ్గి, మీ గొంతు అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

భారీ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ మెయిన్ హైలైట్ దీని పవర్‌ఫుల్ బ్యాటరీ పవర్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే కేస్ సహాయంతో.. ఏకంగా 60 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా.. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ (సపోర్ట్ ఉండటం వలన తక్కువ సమయంలోనే.. త్వరగా ఛార్జ్ అవుతుంది.

Also Read: ట్రెండీ లుక్,సూపర్ బ్యాటరీతో..బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్

గేమింగ్ :

మొబైల్ గేమింగ్ ఆడే వారి కోసం ఇందులో స్పెషల్ మోడ్ ఉంది, ఇది ఆడియో, వీడియో మధ్య గ్యాప్‌ను తగ్గించి గేమింగ్ ఫీల్ ఇది మెరుగుపరుస్తుంది. అలాగే IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల చెమట లేదా చిన్నపాటి నీటి బిందువుల నుంచి ఇయర్‌ బడ్స్ సురక్షితంగా ఉంటాయి.

ధర:

ఫ్లిప్‌ కార్ట్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ ఫారమ్‌లలో ఈ ఇయర్‌ బడ్స్ కేవలం రూ.1069 ధరకే లభిస్తున్నాయి. వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు పొందడం నిజంగా గొప్ప విషయమే.

గమనిక: ఆన్‌లైన్ సేల్స్ , డిస్కౌంట్ల ఆధారంగా ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×