E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో CMF కొత్త ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు, ఏకంగా 52 గంటల బ్యాటరీ లైఫ్!

బడ్జెట్ ధరలో CMF కొత్త ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు, ఏకంగా 52 గంటల బ్యాటరీ లైఫ్!
Advertisement

CMF Buds Neo: సౌండ్ క్వాలిటీ, మంచి డిజైన్ ఉన్న ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి నథింగ్ సబ్‌బ్రాండ్ CMF ఒక గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లోకి CMF Buds Neo పేరుతో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. రూ.1,999కే అందుబాటులోకి వచ్చిన ఈ బడ్స్.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. బ్లాక్, వైట్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తాయి. ఈ నెల 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ స్టోర్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

మైండ్ బ్లాక్ చేసే సౌండ్ క్వాలిటీ..

ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm డ్రైవర్లను అందించడం వల్ల పాటలు వినేటప్పుడు బేస్, సౌండ్ క్లారిటీ చాలా బాగుంటాయి. ఇందులో 35dB అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ఉంది. దీంతో బయటి గోల వినపడకుండా మనకు కావలసిన సంగీతాన్ని హాయిగా వినవచ్చు. అలాగే చుట్టూ జరిగే విషయాలు వినాలనుకుంటే ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌కి మారవచ్చు. గేమింగ్ ఇష్టపడే వారి కోసం ల్యాగ్ లేకుండా ఉండేందుకు 120ms లో-లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఇచ్చారు.

Advertisement

Also Read: మార్కెట్లోకి వివో కొత్త ఫోన్.. ఆండ్రాయిడ్ 16, 8GB ర్యామ్‌తో గీక్‌బెంచ్‌లో లీక్!

రోజంతా మాట్లాడినా క్లియర్ వాయిస్..

ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం ఇందులో 4 హెచ్‌డీ మైక్రోఫోన్లు అమర్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికత వల్ల మనం మాట్లాడే మాటలు అవతలి వారికి ఎలాంటి అంతరాయం లేకుండా స్పష్టంగా వినిపిస్తాయి. నథింగ్ ఎక్స్ (Nothing X) యాప్ ద్వారా సౌండ్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా 6 ఈక్వలైజర్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

కనెక్టివిటీ, వాడకం చాలా ఈజీ..

Advertisement

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 6.0 వెర్షన్ ఉపయోగించారు. ఒక్కసారిగా రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల ఆఫీస్ వర్క్, పర్సనల్ యూజ్ రెండింటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ వల్ల ఫోన్‌కి వెంటనే కనెక్ట్ అవుతాయి. ఇయర్‌బడ్స్‌పై చిన్న టచ్‌లతోనే పాటలు మార్చడం, కాల్స్ మాట్లాడడం, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం వంటివి సులభంగా చేయవచ్చు.

10 నిమిషాల ఛార్జింగ్ చాలు..

బ్యాటరీ పరంగా ఇవి మిమ్మల్ని అస్సలు నిరాశపరచవు. ANC మోడ్ ఆఫ్ చేసి వాడితే కేస్‌తో కలిపి ఏకంగా 52 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే 11 గంటల పాటు పనిచేస్తాయి. అత్యవసర సమయంలో కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 5.5 గంటల పాటు పాటలు వినవచ్చు. ధూళి, నీటి చుక్కల నుండి రక్షణ కోసం వీటికి IP54 రేటింగ్ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.

Also Read: నెట్‌ఫ్లిక్స్ కోసం విడిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగానే చూడొచ్చు!

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×