Budget Friendly AC: ఎండాకాలం ఎండలు తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో, కనీసం ఇంట్లోనైనా చల్లని వెదర్ ఉండాలని అనేక మంది కోరుకుంటారు. అందుకోసం పలువురు ఎయిర్ కండీషనర్ కొనుగోలు చేయాలని భావిస్తారు. అలాంటి వారి కోసం గోద్రెజ్ 5 ఇన్ 1.. 1.4 టన్ 3 స్టార్ ఏసీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ AC అత్యాధునిక టెక్నాలజీతో, వేడి ఉష్ణోగ్రతలకు సమర్థంగా ఎదుర్కొని మీ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. అయితే ఇది అదిరిపోయే తగ్గింపు ధరల్లో ఉండటం విశేషం. ఈ క్రమంలో దీని ఫీచర్లు, ఆఫర్ ధర వివరాల గురించి ఇక్కడ చూద్దాం.
గోద్రెజ్ 5 ఇన్ 1 కన్వర్టిబుల్ AC ప్రత్యేకతలు
ఈ ఎయిర్ కండీషనర్ ఐదు రకాల కూలింగ్ మోడ్‌లతో వస్తుంది. మీరు మీ అవసరాన్ని బట్టి కూలింగ్ స్థాయిని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోచ్చు. దీనివల్ల మీరు ఎక్కువ విద్యుత్ ఆదా చేసుకోవచ్చు, అవసరానికి తగినట్లుగా వాడుకోవచ్చు.
1.4 టన్ సామర్థ్యం
సాధారణంగా చిన్న గదులకే AC లు ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ ఈ 1.4 టన్ AC చిన్న గదులు మాత్రమే కాకుండా, మధ్యస్థాయి గదులకు కూడా సరిపోతుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో గదిని సమర్థంగా కూలింగ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.
3 స్టార్ ఎనర్జీ రేటింగ్
ఈ AC 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. అంటే తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ కూలింగ్ అందిస్తుంది. మీ విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. అదే సమయంలో మిమ్మల్ని మీరు వేడి నుంచి కాపాడుకోవచ్చు.
హెవీ డ్యూటీ కూలింగ్
ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ AC అత్యంత వేగంగా గదిని చల్లబరుస్తుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాటి పోయినా, గోద్రెజ్ AC వేడిని తట్టుకుని చల్లని గాలిని అందిస్తుంది.
Read Also: Sony TV Offer: సోనీ 55 ఇంచ్ స్మార్ట్ HD టీవీపై రూ. 42 వేల .
కాపర్ కండెన్సర్
కాపర్ కండెన్సర్ ACలలో సమర్థంగా పనిచేస్తుంది. దీని వలన AC ఎక్కువకాలం నాణ్యంగా ఉంటుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాలం మన్నికను అందిస్తుంది.
ఇన్వర్టర్ టెక్నాలజీ
ఇన్వర్టర్ AC లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ గోద్రెజ్ AC ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించి గదిలో కూలింగ్ స్థాయిని నియంత్రిస్తుంది. అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగించడం వల్ల మీ బిల్లు కూడా తగ్గుతుంది.
గోద్రెజ్ 5-ఇన్-1 AC ఉపయోగాలు
-వేడి నుంచి తక్షణ ఉపశమనం – ఎండ తీవ్రంగా ఉన్నా కూడా మీ గదిని చల్లగా ఉంచుతుంది.
-విద్యుత్ ఖర్చులు తగ్గింపు – 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ వలన తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది
-పెద్ద గదులకు కూడా సరిపోతుంది – 1.4 టన్ సామర్థ్యంతో చిన్న, మధ్యస్థాయి గదులకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
-అధిక మన్నిక – కాపర్ కండెన్సర్ వలన దీర్ఘకాలం పనిచేస్తుంది.
-స్మార్ట్ రిమోట్‌తో సులభ నిర్వహణ – దూరం నుంచే సులభంగా నియంత్రించుకోవచ్చు.
ధర, ప్రత్యేక తగ్గింపు
ప్రస్తుతం ఈ గోద్రెజ్ 5-ఇన్-1 AC రూ. 29,990 కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. రూ. 43,900 కాగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో 31% తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.