Gundeninda GudiGantalu Today episode April 2 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారు కదా వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది చేసి పెట్టాలని మీ నాకు ఆర్డర్ వేస్తుంది. కానీ సుశీలమ్మ మాత్రం కానీ సుశీలమ్మ మాత్రం నేను నీకు అత్తగారిని కదా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నువ్వు చెప్పిన లిస్టు మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి అని షాక్ ఇస్తుంది. నేనొక్కదాన్నే ఎలా చేయాలంటే నీ ముద్దుల కోడలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్లు నీకు సాయం చేస్తారు అని అంటుంది. బాలు ఫుల్లు ఖుషి గా ఉంటాడు. ఇన్నాళ్లకు తిక్క కుదిరిందని సంతోషపడతాడు. షీలా ఆర్డర్ వేసింది అంటే కచ్చితంగా చేయాల్సిందే మీరందరూ వెళ్లి ఆ పని చేయండి అనేసి బాలు అంటాడు. కొత్తగా ఇది నా ఆర్డర్ ఇక్కడ అన్ని నా ప్రకారమే చేయాలని ప్రభావతికి షీలా ఆర్డర్ వేస్తుంది. తన కోడళ్లతో తిప్పలు పడి వంటను పూర్తి చేస్తుంది. అందరు సరదాగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నాలుగు తరాల నుంచి కోడళ్లను కూతురుగా చూస్తున్న ఇల్లు ఇది అని వివరిస్తుంది. ఇక మీనాను లేచి వచ్చి ప్రభావతి పక్కన కూర్చొమని, ముగ్గురికి ప్రేమగా తినిపించు అని తన కోడలను సుశీలమ్మ ఆదేశిస్తుంది. కానీ ప్రభావతి రోహిణి, శృతికి ప్రేమగా తినిపించి మీనాకు మాత్రం విసుక్కుంటూ నోట్లో కుక్కుతుంది. దాంతోనూ సుశీలమ్మ మండిపడుతుంది. భోజనాలను పూర్తి చేస్తారు. భోజనాల తర్వాత అందరూ సరదాగా స్వీట్లు తినాలని మీనా సుశీల అందరికీ స్వీట్లు ఇస్తారు. బాలు మీనాని సుశీల విడగొడుతుంది. బాలు మీనా కోసం సైగలు చేస్తాడు బామ్మ ఎక్కడో చోటు పడుకుంటుందిలే మనం వెళ్లి లోపలికి వెళ్లి పడుకున్నాను రా అనేసి అడుగుతాడు..
రాజమండ్రిలో తన మేనమామ చిన్ననాటి స్నేహితులు ఉన్నారని వారిని కలిసి ఇక్కడికి కారులో వస్తారని చెబుతుంది. అయితే తనకు మలేషియాలో మేనమామ లేనప్పటికీ ఒక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా నటింపజేసేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇక అతనే ఇప్పుడు రోహిణి మేనమామగా ఇంట్లో వారికి పరిచయం కాబోతున్నాడు. అప్పటికే బాలుకు మలేషియా నుంచి వస్తున్న రోహిణి మేనమామ పై అనుమానం ఉంటుంది. ప్రభావతి ఓవర్ యాక్షన్ తో కూడా అనుమానం మొదలవుతుంది. రాకరాక మొట్టమొదటిసారిగా వస్తున్న రోహిణి మేనమామ తమ ఇంటికి రాకుండా గ్రామానికి ఎందుకు వస్తున్నాడని సందేహం వ్యక్తం అవుతుంది. ఇక అతను వచ్చాక అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలంటూ బాలు, సత్యం నిర్ణయించుకుంటారు..
రోహిణి టెన్షన్ పడుతూ విద్యకు ఫోన్ చేస్తుంది ఆ మటన్ కొట్టు మాణిక్యం ఇంకా రాలేదంటే వస్తాడా లేకపోతే వస్తువులను తీసుకొని అలానే పారిపోతాడా అది అడుగుతుంది. అతనికి మటన్ అంటే చాలా ఇష్టం నువ్వేం బాధపడకు వస్తాడులే అనేసి అంటుంది. మీనా సుశీలమ్మ అందరికీ స్వీట్ ఇస్తారు. అయితే బాలు మీనా కోసం రాసిన లవ్ లెటర్ అందరూ చదువుతారు.. ముందుగా మనోజ్ రోహిణి దగ్గరకు ఉత్తరం వెళ్తుంది. అలా అందరు గడ్డివాము గురించి మాట్లాడుకుంటారు.
చివరగా ప్రభావతి సత్యం దగ్గరకు ఆ లెటర్ వెళ్తుంది. పిలిచి మాట్లాడాలా? అని అలుగుతుంది. ఇంకా నేను వెళ్తున్నానని చెప్పడంతో బాలు ఆపుతాడు. ఆ వెంటనే ఓ బ్యూటీఫుల్ సాంగ్ తో డ్యాన్స్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. ‘గోదారిగట్టు మీద రామ చిలకావె’ పాటకు చిందులేస్తూ సంతోషించారు. ఇక వీళ్లలాగే బాలు రాసిన లెటర్ వాళ్ల, మనోజ్ – రోహిణి, శృతి – రవి, చివరికి ప్రభావతి, సత్యం కూడా ఆ గడ్డివాము దగ్గరకు చేరి తమ మెమోరీస్ ను గుర్తుచేసుకుంటారు. వాళ్లు కూడా అదే సాంగ్ కు డ్యాన్స్ వేసి ఆకట్టుకుంటారు. అయితే వీళ్లందరూ గడ్డివాము దగ్గరికి వచ్చేది. వాళ్లు చేసేస్తారు. అలా అందరు సుశీలకు దొరికిపోతారు.
బాలు-మీనా, మనోజ్ – రోహిణి, రవి – శృతి, సత్యం – ప్రభావతి అంతా బయటికి వస్తారు. ఒక్కొక్కరూ బయటికి వస్తారు. ఒకరినొకరు చూసుకొని మొహం చాటేస్తారు. అందరూ అక్కడ ఏం మీటింగ్ పెట్టారురా అని సుశీలమ్మ సత్యంను అడగడంతో తడబడుతాడు. ప్రభావతి రమ్మని చెబితే వచ్చానని బదులిస్తాడు. దాంతో ప్రభావతి నేను రమ్మనలేదు… ఆ ఉత్తరం నువ్వు రాయలేదా? అని సత్యంను అడుగుతుంది. నేను రాయలేదు అని సత్యం చెబుతాడు. ఇక రవి -శృతి, మనోజ్ – రోహిణి కూడా ఆ లెటర్ నువ్వు రాయలేదా? అని ఒకరి మొహం మరొకరు చూసుకుంటారు..
బాలు నిజం ఒప్పుకుంటాడు. ఆ లెటర్ తన భార్య మీనా కోసం రాశానని చెబుతాడు. కానీ వీళ్లందరికీ ఇలా చేరుతుందని అనుకోలేదంటూ చెప్పి ఆశ్యర్యపడుతాడు. బాలు చేసిన పనికి అంతా ఫూల్ అవుతారు. కానీ కొద్ది క్షణాలైనా సంతోషంగా ఒకరితోమరొకరు సమయం గడుపుతారు. తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు. ఇక మళ్లీ బాలు – మీనా ఏకాంతంగా కలుస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మలేషియా మామ గుట్టు రట్టు అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..