Waiting Ticket Confirmation Process: పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రద్దీగా ఉన్నప్పుడు వెయిటింగ్ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో? లేదో? అని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే, డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టికెట్ దొరకడం కష్టంగా ఉంటుంది. అయితే, వెయిటింగ్ టికెట్ ఎలా కన్ఫర్మ్ అవుతుందో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో? ఏ విధానాన్ని ఫాలో అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
వెయిటింగ్ టికెట్ల కన్ఫర్మేషన్ ఎలా?
వెయిటింగ్ టికెట్ల కన్ఫర్మేషన్ అనేది ప్రయాణీకుల క్యాన్సిలేషణ్, అత్యవసర కోటా టికెట్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 21% మంది ప్రయాణీకులు తమ టికెట్లను ప్రయాణ సమయానికి రద్దు చేసుకుంటారు. వీరి స్థానంలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకులకు సీట్లు లభించే అవకాశం ఉంటుంది. అటు 4 నుంచి 5% మంది ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ప్రయాణించరు. మరికొన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇక రైల్వేకు సంబంధించిన అత్యవసర కోటా కూడా వెయిటింగ్ టికెట్లను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కోటా కింద కొన్ని సీట్లు మెడికల్ ఎమర్జెన్సీ లాంటి వంటి అత్యవసరంగా ప్రయాణించాల్సిన వ్యక్తుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఈ కోటాను పూర్తిగా వినియోగించుకోకపోతే, మిగిలిన సీట్లను వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణీకులకు ఇవ్వవచ్చు.
వెయిటింగ్ టికెట్ల ఎన్ని రకాలు?
వెయిటింగ్ టికెట్లు పలు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి WL (వెయిటింగ్ లిస్ట్). ఇది అత్యంత సాధారణమైన వెయిటింగ్ టికెట్ రకం. ఈ విధానంలో టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొకటి RAC (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్). దీనిలో ఇద్దరు ప్రయాణీకులు ఒకే బెర్త్ పై ప్రయాణించడానికి అనుమతించబడతారు. ఒక ప్రయాణీకుడు ప్రయాణించకపోతే, అతడి సీటును మరొక ప్రయాణీకుడికి RACగా ఇవ్వవచ్చు. ఇంకోటి TQWL (తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్). తత్కాల్ టికెట్ బుకింగ్ లో వెయిట్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఈ కోడ్ కనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. PQWL (పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్). ఈ కోడ్‌ను సుదూర రైలులో ఇంటర్మీడియట్ స్టేషన్ల మధ్య ప్రయాణించేటప్పుడు ఉపయోగించబడుతుంది. ఈ టికెట్ల కన్ఫర్మ్ అనేది మరీ సాధారణంగా ఉంటుంది. RSWL (రోడ్ సైడ్ స్టేషన్ వెయిటింగ్ లిస్ట్). రైలు బయలుదేరే స్టేషన్ల నుంచి రోడ్ సైడ్ స్టేషన్లకు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కోడ్ వస్తుంది. ఇది నిర్ధారించబడే అవకాశం తక్కువగా ఉంటుంది. RLWL (రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్) ఈ కోడ్ చిన్న స్టేషన్లకు ఉపయోగిస్తారు. కన్ఫర్మేషన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వెయిటింగ్ టికెట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి?
వీలైనంత వరకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ తక్కువగా ఉంటుంది. మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైతే, రద్దీగా ఉండే మార్గాల కంటే తక్కువ రద్దీ ఉన్న మార్గాలను ఎంచుకోండి. రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో కాకుండా తక్కువ రద్దీ ఉన్న సమయంలో టికెట్లను బుక్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తక్కువగా వెయిటింగ్ లిస్టు ఉండేలా చూసుకోవడం వల్ల టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.
వెయిటింగ్ టికెట్ కన్ఫర్మేషన్ ఫార్ములా
వెయిటింగ్ టికెట్ నిర్ధారణ ఫార్ములా ప్రధానంగా సాధారణ రద్దు, అత్యవసర కోటాపై ఆధారపడి ఉంటుంది. ఒక స్లీపర్ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. 21% మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకుని, 4-5% మంది టికెట్లు ఉన్నా ప్రయాణించకపోతే, దాదాపు 18% సీట్లు (25%) వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణీకులకు ఇవ్వవచ్చు. ఇదే ఫార్ములా థర్డ్ AC, సెకండ్ AC, మరియు ఫస్ట్ AC వంటి ఇతర కోచ్‌లకు కూడా వర్తిస్తుంది.
Read Also: తత్కాల్ టికెట్ల బుకింగ్ లో ఏఐ టెక్నాలజీ, బాబోయ్ ఇన్ని లాభాలున్నాయా?