Lady Aghori – Srivarshini : శ్రీవర్షిణి. లేడీ అఘోరీ. 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ న్యూస్ ఇది. ఇంట్లో నుంచి పారిపోయింది వర్షిణి. గుజరాత్‌లో అఘోరీతో ఉండగా పట్టుకున్నారు పోలీసులు. బలవంతంగా ఏపీకి తీసుకొచ్చారు. ఇంటికి రాకుండానే మళ్లీ శ్రీవర్షిణి ఎస్కేప్. బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి.. అఘోరీతో తనకు పెళ్లి అయిందనే విషయం సభ్య సమాజానికి చెప్పేసి వెళ్లిపోయింది. తమ ప్రేమ పెళ్లిలో విష్ణునే విలన్ అని డిక్లేర్ చేసింది. రాత్రికి రాత్రే మాయమై.. మళ్లీ అఘోరీతో లాంగ్ డ్రైవ్ మొదలుపెట్టింది. ఇల్లు కట్టుకుంటామని.. మంచిగా సెటిల్ అవుతామని చెబుతోంది. తమను విడదీయాలని చూస్తే.. చచ్చిపోతామని బెదిరిస్తోంది. ఇదీ ఇప్పటి వరకూ ఉన్న లేటెస్ట్ అప్‌డేట్స్.
ఎవరు విన్నర్? ఆల్ హ్యాపీస్?
ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు మాత్రమే హ్యాపీ. ఒకరు శ్రీవర్షిణి. ఇంకొకరు లేడీ అఘోరీ. వర్షిణి పేరెంట్స్, బ్రదర్, బంధువులు, ఫ్రెండ్స్ అంతా అవాక్కవుతున్నారు. అఘోరీని పెళ్లి చేసుకోవడం ఏంటని. ఆమెతో ఈమె కాపురం చేయడం ఏంటని. ఆడ – ఆడ పెళ్లి చేసుకునే ఆచారం మనది కాదని. వర్షిణికి ఇప్పుడు జస్ట్ 23 ఇయర్స్. ఈ ఏజ్ చాలా డేంజరస్. ఇలాంటి అనూహ్య నిర్ణయాలే తీసుకుంటుంటారు. ఆ టైమ్‌కు ఏది నచ్చితే అది చేస్తుంటారు. ప్రస్తుతం వర్షిణి వ్యవహారం అలానే ఉంది. అఘోరీతో క్రష్‌లో ఉంది. ఆదే ప్రేమ అనుకుంటోంది. పెళ్లి వరకూ వెళ్లిపోయింది. జీవితాంతం ఇలానే ఉంటామని కల గంటోంది. అది సాధ్యమా?
లాంగ్ జర్నీనా? స్పీడ్ బ్రేకర్లు ఉండవా?
ఇప్పటి వరకు వాళ్లిద్దరూ కొన్ని వారాలే కలిసి ఉన్నారు. ఆ మాత్రం దానికే లైఫ్ లాంగ్ కలిసుంటారా? కాలం గడిచే కొద్దీ.. ఏజ్ పెరిగే కొద్దీ.. మెచ్యూరిటీ వచ్చే కొద్దీ.. ఫీలింగ్స్ మారిపోవా? ఒపీనియన్స్ మార్చేయరా? అప్పటికి గడిచిన కాలం తిరిగి తీసుకురాగలరా ? అప్పటికే జరిగిపోయిన డ్యామేజ్‌ను కవర్ చేయడం పాజిబులా? ఇలా అనేక ప్రశ్నలు.
అఘోరీని నమ్మొచ్చా?
అఘోరీది పోయేదేముంది? ఇప్పటికే అతను ఇంటిని, కుటుంబాన్ని వదిలేశాడు. ఆమెగా మారి అఘోరీ అమ్మ అవతారం ఎత్తాడు. ఎక్కడుంటుందో తెలీదు.. ఏం చేస్తుందో తెలీదు.. డబ్బుులు ఎలా వస్తాయో తెలీదు.. వర్షిణితో ఎన్నాళ్లు కలిసుంటుందో తెలీదు. అలాంటి లేడీ అఘోరీని నమ్ముకుని శ్రీవర్షిణి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటోందని ఆమె పేరెంట్స్ కుమిలిపోతున్నారు. తమ బిడ్డ జీవితం ఇలాంటి టర్న్ తీసుకుందేంటి దేవుడా అని తెగ బాధపడిపోతున్నారు.
అంతా అఘోరీనే చేస్తోందా?
ఇన్నాళ్లూ తాను అఘోరీనని.. తన జీవితం శివునికే అంకితం అని చెప్పింది. సనాతన ధర్మం కోసం పోరాడుతానని ప్రకటించుకుంది. ఇప్పుడేమో శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నానని.. ఆమెతో కలిసి కాపురం చేస్తానని అంటోంది. ఇంతకీ అఘోరీ.. సన్యాసా? సంసారా? శివుని కోసం బతుకుతోందా? శ్రీవర్షిణి కోసం బతుకుతుందా? సనాతనం కోసం పోరాటం అంటే ఇదేనా? మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టడమేనా? అసలు ఆమె నిజమైన అఘోరీనేనా? అని వర్షిణి కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు. స్వామీజీలే చెప్పాలి వీటికి ఆన్సర్స్.
వర్షిణి వాదన కరెక్టేనా?
వర్షిణి తాను మేజర్ అని గట్టిగా చెబుతోంది. పెళ్లి అంటే మగాడితోనే చేసుకోవాలా? అని వాదిస్తోంది. కావాలంటే అనాథ పిల్లలను పెంచుకుంటామని అంటోంది. ఇదంతా క్లారిటీ అనుకోవాలా? మెచ్యూరిటీగా చూడాలా? లేదంటే ఆ వయస్సులో వచ్చిన టెంపర్‌మెంట్ అనుకోవాలా? సైకాలజిస్టులే వివరించి చెప్పాలి ఈ మేటర్‌ను ఎలా చూడాలో.
విష్ణు విలనా? గేమ్ ఛేంజరా?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో విష్ణు టాపిక్ ఇంట్రెస్టింగ్. వర్షిణి.. అఘోరీ దగ్గరికి చేరకుండా మాగ్జిమమ్ ట్రై చేశాడు. ఇంట్లో వాళ్లకు బ్రెయిన్ వాష్ చేశాడు. సభ్య సమాజంలో ఇలాంటివి కరెక్ట్ కాదని హితబోధ చేశాడు. చివరికి వర్షిణికి.. విష్ణునే విలన్‌గా కనిపించాడు. పోలీసులను వెంటేసుకుని గుజరాత్ వరకూ వెళ్లి.. తన చెల్లి కాని చెల్లిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చేందుకు విష్ణు గట్టి ప్రయత్నమే చేశాడు. ఆ క్రమంలో హద్దు దాటి వర్షిణిని విష్ణు కొట్టడం ముమ్మాటికీ తప్పే. అందుకే, ఆమె అతన్ని అంతగా ధ్వేషిస్తోంది ప్రస్తుతం. మా అన్న మంచోడే కానీ.. ఈ విషయంలో మాత్రం మంచోడు కాదనేది శ్రీవర్షిణి చెబుతున్న మాట.
Also Read : అఘోరీ వెడ్స్ వర్షిణి.. హ్యాపీ ఎండింగ్?
వెయిట్ అండ్ సీ..
ప్రస్తుతం అందరినీ వదిలేసి.. అఘోరీనే తన ప్రపంచం అంటూ.. సొంత జీవితం కోసం సుదీర్ఘ ప్రయాణం స్టార్ట్ చేసింది వర్షిణి. మరి, ఈ లాంగ్ జర్నీ.. ఎలాంటి యాక్సిడెంట్లు, ట్విస్టులు లేకుండా సాఫీగా సాగుతుందా? మొత్తం ఎపిసోడ్‌లో వర్షిణి నెగ్గినట్టా? అఘోరీ మినహా సర్వం కోల్పోయినట్టా? కాలమే చెబుతుంది జడ్జిమెంట్.