New YouTube Feature: సాధారణంగా యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోల థంబ్‌నెయిల్‌లు ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం అసభ్యంగా కనిపిస్తుంటాయి. కానీ ఇకపై అలాంటి అసభ్యకరమైన థంబ్‌నెయిల్స్ కనిపించవు. ఎందుకంటే అలాంటి వాటిని మార్చేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. గూగుల్ యాజమాన్యం అసభ్యంగా కనిపించే థంబ్‌నెయిల్‌లను ఆటోమేటిక్‌గా గుర్తించి వాటిని బ్లర్ చేసే సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే క్లిక్ కోసం ఉద్దేశపూర్వకంగా పెట్టే థంబ్‌నెయిల్‌లను ఇక నుంచి చూసే ఛాన్స్ ఉండదు. డిజిటల్ ప్రపంచాన్ని మరింత పద్ధతిగా మార్చేందుకు యూట్యూబ్ తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయం గురించి తెలుసుకుందాం.
థంబ్‌నెయిల్ టార్గెట్ ఎందుకంటే..
వీడియో చూసే ముందు మనకు కనిపించేది మొదట థంబ్‌నెయిల్. చాలా సార్లు వీడియో కంటెంట్ కంటే ఎక్కువగా, థంబ్‌నెయిల్‌నే చూసి అనేక మంది క్లిక్ చేస్తారు. దీనిని అవకాశంగా మార్చుకుని కొంతమంది కంటెంట్‌కి సంబంధం లేకుండా, చాలా సార్లు అసభ్యంగా కూడా థంబ్‌నెయిల్‌లు తయారు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి యూట్యూబ్ వాడే వారికి చికాకు మారుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ను కట్టడి చేసేందుకు సిద్ధమైంది.
టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్
గూగుల్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను కొన్ని పరిమితమైన యూజర్లతో మాత్రమే పరీక్షిస్తున్నారు. యూట్యూబ్‌లో కొన్నిమార్పుల ఆధారంగా “సెన్సిటివ్ కంటెంట్”గా గుర్తించిన వీడియోల థంబ్‌నెయిల్‌ను మాత్రమే బ్లర్ చేస్తారు. వీడియో కంటెంట్ అయితే అలాగే ఉంటుంది. కానీ యూజర్ ఇష్టపడితే వీడియో చూడచ్చు, లేదంటే వదిలేయవచ్చు.
Read Also: Regional Rural Banks: మే 1 నుంచి 15 బ్యాంకుల విలీనం..
సెన్సార్‌షిప్ కాదు (New YouTube Feature)
ఇది వీడియోలను తొలగించడమో, ఫలితాలను దాచడమో కాదు. కేవలం థంబ్‌నెయిల్ రూపంలో కనిపించే అసభ్యమైన దృశ్యాల్ని తాత్కాలికంగా బ్లర్ చేయడమే. వినియోగదారుడు కోరుకుంటే మాన్యువల్‌గా అన్‌బ్లర్ చేసే అవకాశం కూడా ఇస్తోంది.
ఇది ఎలా భిన్నంగా ఉంటుంది
మీరు గూగుల్ Safe Search ఫీచర్‌ని వాడి ఉంటే, అది సెర్చ్‌లో అస్పష్టమైన ఫలితాలను పూర్తిగా తొలగించేస్తుంది. అలా కాకుండా చూడాలంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ను మాత్రమే బ్లర్ చేస్తోంది. వీడియో, ఛానెల్ పేరు, ఇతర వివరాలు అన్నీ యథాతథంగా కనిపిస్తాయి. ఈ విధానం వల్ల యూజర్‌కి పూర్తిగా ఆ వీడియోను చూడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తుంది.
వ్యాపారం కూడా ఉందా..
యూట్యూబ్ చేస్తున్న ఈ ప్రయోగం కేవలం భద్రత కోసం మాత్రమే కాదు. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా ఎక్కువగా యూజర్లను ప్లాట్‌ఫారమ్‌కి ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది యూట్యూబ్. కుటుంబ యూజర్లు, పిల్లల భద్రత కోసం కూడా ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో కంటెంట్ క్రియేటర్లకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తోంది. అసభ్యంగా కాకుండా సృజనాత్మకంగా థంబ్‌నెయిల్‌లను తయారు చేయాలని సూచిస్తోంది.
విడుదల ఎప్పుడంటే
ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలోనే ఉంది. అందువల్ల ఇది అందరికీ ఎప్పుడు వస్తుంది? లేదా మార్పులు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఈ పరీక్ష విజయవంతమైతే… భవిష్యత్తులో యూట్యూబ్ మరింత చక్కటి వీడియో ప్లాట్‌ఫారమ్‌గా మారే అవకాశముంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే, ముఖ్యంగా పిల్లల భద్రతను పరిగణనలోకి తీసుకునే తల్లిదండ్రులకు ఇది చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.