BigTV English

Gmail Scam : “స్కామర్స్ రెడీగా ఉన్నారు.. ఈ 20 రోజులు అప్రమత్తంగా ఉండండి” – జీమెయిల్

Gmail Scam : “స్కామర్స్ రెడీగా ఉన్నారు.. ఈ 20 రోజులు అప్రమత్తంగా ఉండండి” – జీమెయిల్

Gmail Scam :  సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో Gmail స్కామ్‌లకు వ్యతిరేకంగా గూగుల్ హెచ్చరికను జారీ చేసింది. మోసపూరిత పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను కోరింది.


రోజు రోజుకూ పెరిగిపోతున్న స్కామ్స్ తో అప్రమత్తంగా ఉండాలని జీమెయిల్ హెచ్చరించింది. జీమెయిల్ లో స్కామ్స్ సంఖ్య పెరిగిపోతుందని.. సెలవుల సీజన్ రావడంతో Gmail వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని స్కామర్స్ రెచ్చిపోతున్నారని తెలిపింది.

నవంబర్ మధ్య నుండి ఈమెయిల్ ట్రాఫిక్‌లో భారీ పెరుగుదల కనిపించిందని… Gmail వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే స్కామ్స్ జరగటం గుర్తించాలమని గూగుల్ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఫిషింగ్ దాడుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే స్కామ్స్ చేసేవారు ఫిషింగ్ దాడులతో పాటు స్కామ్‌ల రెండో వేవ్‌ను ప్లాన్ చేయడానికి తమను తాము సిద్ధం చేసుకుంటున్నారని, అందుకే యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.


ప్రపంచవ్యాప్తంగా Gmail 2.5 బిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. అందువల్ల యూజర్స్ కోసం స్పష్టమైన ఇన్‌బాక్స్‌లను క్రిమోట్ చేయటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. అయితే ఇది Gmailలో 99.9% స్పామ్, ఫిషింగ్, మాల్వేర్‌లను బ్లాక్ చేస్తుందని చెబుతోంది. అయితే ఈ దాడి చేసేవారు యూజర్స్ ఇన్‌బాక్స్‌లకు చేరటానికి పలు మార్గాలు అన్వేషిస్తారని తెలిపింది.

అయితే Google గత ఏడాది భద్రతా ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ఆ ముందుతో పోలిస్తే ఫిషింగ్ దాడిని 35% తగ్గించగలిగిందని తెలిపింది. ఈ ఏడాది కూడా గూగుల్ ప్రపంచవ్యాప్తంగా Gmail వినియోగదారులను ఆదా చేసే అనేక AI సాంకేతికతలతో ముందుకు వచ్చింది. Google కొత్తగా తీసుకొచ్చిన కొత్త భాషా మోడల్ (LLM)… ఫిషింగ్, మాల్వేర్, స్పామ్ దాడులను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. మునుపటి కంటే 20% ఎక్కువ స్పామ్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  అదనంగా, ఇది ప్రతిరోజూ 1,000 రెట్లు ఎక్కువ యూజర్ రిపోర్ట్ చేసిన స్పామ్‌లను సమీక్షిస్తుంది.

గూగుల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు ముందు AI మోడల్‌ను కూడా పరిచయం చేసింది. ఇది మంచి ఫలితాలను అందించింది. ఈ ఏఐ మోడల్ ఇప్పటికే ఉన్న AI మోడల్‌కు సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంది. రెప్పపాటులో వందలాది బెదిరింపులు, ప్రమాదకర సందేశాలను అంచనా వేయగలుగుతుంది. ఇది తగిన రక్షణను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఇక హాలిడే సీజన్‌లో ఈ మెయిల్ స్కామ్స్ ఇవే – ఈ హాలిడే సీజన్‌లో యూజర్‌లను టార్గెట్ చేసే మూడు స్కామ్‌లను గూగుల్ వెల్లడించింది.

ఇన్‌వాయిస్ స్కామ్స్ – ఈ స్కామ్‌లో స్కామర్‌లు తమను అనుమానించని వినియోగదారులకు నకిలీ ఇన్‌వాయిస్‌లను పంపుతారు. స్కామర్‌లు ఫోన్ కాల్స్ చేసి, వేరే వాళ్లకి పేమెంట్స్ చేయమని చెబుతారు.

సెలబ్రెటీ స్కామ్స్ – ఈ స్కామ్‌లో స్కామర్‌లు సెలబ్రిటీలుగా ఫోజులిచ్చి, తాము ఫలానా బ్రాండ్ ను ఎండార్స్ చేస్తున్నామని చెబుతారు. వారు సెలబ్రిటీలతో పాటు ఎందరో యూజర్స్ పెట్టుబడి పెట్టారని చెబుతారు.

దోపిడీ స్కామ్స్ – దోపిడీ స్కామ్‌లు సైతం ఎక్కువగానే జరుగుతున్నాయి. జాబ్స్ ఇప్పిస్తామని, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని చెబుతూ ఆశ పెడతుంటారు. నిలువునా ముంచేస్తారు.

ALSo READ : ఛార్జర్ తో మీ ఫోన్ డేటా హాంఫట్, కొత్త పద్దతిలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు!

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×