TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది సందర్భంగా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం కొత్త ఏడాదికి టీటీడీ ఆధ్వర్యంలో డైరీలు, క్యాలెండర్ ను అందించడం ఆనవాయితీ. ఆ సందర్భంగా ఆంగ్లనామ సంవత్సరం 2025 డైరీలను సైతం టీటీడీ సిద్ధం చేసినట్లు చైర్మన్ బీ.ఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అందించే డైరీలను క్యాలెండర్లను అందుకునేందుకు భక్తులు అమిత ఆసక్తి చూపుతారు. అందుకే ప్రతి ఏడాది టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాలెండర్లను, డైరీలను భక్తులకు అందించేందుకు సిద్ధం చేస్తారు. ఈ ఏడాది కూడా టీటీడీ ఆధ్వర్యంలో 2025 డైరీలను క్యాలెండర్లను అందించినట్లు చైర్మన్ బీ.ఆర్ నాయుడు ప్రకటించారు.
AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి
ఈ డైరీలు, క్యాలెండర్లను పొందేందుకు భక్తులు ఆన్లైన్ ద్వారా సైతం పొందేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ తెలిపారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్, సింగల్ షీట్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను భక్తులకు అందుబాటులో టీటీడీ ఉంచింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు ఇతర ప్రాంతాల్లో విక్రయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని టీటీడీ ప్రకటించింది.
ఇక ధరల విషయానికి వస్తే పెద్ద డైరీలు రూ. 150, చిన్న డైరీ రూ.120, 12షీట్ల క్యాలండర్ రూ. 130, టేబుల్ టాప్ క్యాలండర్ ఒకటి రూ. 75 ధరలుగా నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.