Recap 2024 : సినిమాల్లో నటనకు మంచి స్కోప్ ఉండేది రెండు పాత్రలకు మాత్రమే. అందులో ఒకటి హీరో అయితే, మరొకటి విలన్. అయితే హీరో కంటే విలన్ పాత్రలతోనే తమలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయట పెట్టి, ఎక్కువగా ప్రేక్షకులను అబ్బురపరిచే ఛాన్స్ ఉంటుంది నటులకు. పాన్ ఇండియా ట్రెండ్ వెలుగులోకి వచ్చిన తర్వాత చాలామంది స్టార్ హీరోలు సైతం విలన్లుగా మారి, తమ యాక్టింగ్ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2024లో అలా విలన్లుగా మారి, హీరోలను డామినేట్ చేసిన హీరోలు ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.
1. కమల్ హాసన్ (Kamal Haasan)
లోకనాయకుడు కమల్ హాసన్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆయన ‘కల్కి 2898’ మూవీతో పాన్ ఇండియా విలన్ గా మారి, ఈ సినిమాలో హీరోని సైతం డామినేట్ చేశారు. కమల్ సినిమాలో కనిపించింది కాసేపే అయినప్పటికీ ఆయన పాత్ర ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ కొన్ని నిమిషాల్లోనే తన మార్క్ యూనిక్ యాక్టింగ్ తో కమల్ హాసన్ ఆకట్టుకున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.
2. బాబీ డియోల్ (Bobby Deol)
ఇండస్ట్రీలో ఉన్న పవర్ ఫుల్ విలన్ల లిస్టులో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాబి డియోల్. ‘యానిమల్’ సినిమాతో బాబి డియోల్ పేరు మార్మోయిపోయింది. అప్పటి నుంచి ఆయనకు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయి. రీసెంట్ గా తమిళ స్టార్ సూర్య నటించిన యాక్షన్ ఫాంటసీ మూవీ ‘కంగువా’లో కూడా బాబి డియోల్ విలన్ గా కనిపించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ఉధిరన్. హిందీలో ఒకప్పుడు స్టార్ హీరోగా దూసుకెళ్లిన బాబి డియోల్ ‘ఆశ్రమ్’ సిరీస్, ‘యానిమల్’ సినిమాతో విలన్ గా యు టర్న్ తీసుకున్నారు. అయితే హీరోగా కంటే విలన్ గానే ఆయన మంచి పాపులారిటిని కూడగట్టుకున్నారు.
3. మాధవన్ (Madhavan)
మాధవన్ సౌత్ ఇండస్ట్రీలోని దిగ్గజ నటుల్లో ఒకరు. ఇప్పటిదాకా పలు విభిన్నమైన కథలతో హీరోగా అలరించిన మాధవన్ రీసెంట్ గా విలన్ గా మారి భయపెట్టారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హర్రర్స్ థ్రిల్లర్ ‘సైతాన్’ మూవీలో ఆయన నటించిన పాత్ర యూనిక్ గా ఉంటుంది. అజయ్ దేవగన్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సైతాన్’ సినిమాలో వనరాజ్ కశ్యప్ అనే మాంత్రికుడి పాత్రలో అదరగొట్టారు మాధవన్.
ఇక ‘పుష్ప 2’ సినిమాలో ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ తో పోటీపడి నటించారు. అలాగే ‘దేవర’లో సైఫ్ అలీఖాన్, ‘సింగం ఎగైన్’ మూవీలో అర్జున్ కపూర్, ‘స్త్రీ 2’ మూవీలో సునీల్ కుమార్ వంటి హిందీ యాక్టర్స్ విలన్లుగా మారి మెప్పించారు.