Google Pexel 10 : ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గూగుల్.. గత నెలలోనే పిక్సెల్ 9 లైనప్ సిరీస్ ను లాంఛ్ చేసింది. ఈ మెుబైల్ లాంఛ్ అయ్యి నెలరోజులు కూడా పూర్తవ్వకముందే గూగుల్ తన నెక్స్ట్ జనరేషన్ మొబైల్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ లైనప్ లో రాబోతున్న పిక్సెల్ 10A, 11 మొబైల్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీలతో పోటీ పడుతూ గూగుల్ పిక్సెల్ ఇప్పటికే అప్ గ్రేడ్ ఫీచర్స్ తో మొబైల్స్ ను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ 9 లైనప్ సిరీస్ లో లేటెస్ట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పిక్సెల్ 11, పిక్సెల్ 10A మొబైల్ ఫీచర్స్ పై సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ మొబైల్స్ అండర్ ప్రోసెస్ లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఈ గాడ్జెట్స్ మార్కెట్లోకి రావడానికి ఇంకో రెండేళ్లు పడుతుంది
గూగుల్ పిక్సెల్ 11, గూగుల్ పిక్సెల్ 10A కోడ్ నేమ్స్ తో రెండు మొబైల్స్ త్వరలోనే రాబోతున్నాయని.. ప్రస్తుతానికి ఈ మొబైల్స్ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని ఆండ్రాయిడ్ అథారిటీ కొన్ని లీక్స్ ఇచ్చింది. 2026 పిక్సెల్ లైనప్ కి సంబంధించిన కోడ్ నేమ్స్ ఇప్పటికే ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్నాయి. పిక్సెల్ 11 సిరీస్ లో బేర్ థీమ్ కోడ్ నేమ్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ALSO READ : రేపే సామ్సాంగ్ ఈవెంట్.. Galaxy S25 సిరీస్ వచ్చేస్తుందోచ్
గూగుల్ తన లైనప్ లో ప్రతి ఏడాది లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తుంది. పిక్సెల్ 10 సిరీస్ లో ఇదే రూల్ ఫాలో అయితే ఈ ఏడాది ఆగస్టులో ఈ సిరీస్ లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మొబైల్స్ Tensor G5 చిప్‌సెట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది.
పిక్సెల్ 11 సిరీస్ Q2 2026 లో లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. “malibu” అనే కోడ్ నేమ్ తో Tensor G6 చిప్‌సెట్ తో ఈ మొబైల్ వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. పిక్సెల్ 10 ప్రస్తుతానికి అండర్ ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే google ఇప్పటికే ఉపయోగించిన Tensor G4 చిప్‌సెట్ ను ఈ మొబైల్ లో తీసుకు రావాలా? లేదా Tensor G5 చిప్‌సెట్ తో అప్ గ్రేడ్ చేయాలా అనే విషయం పై ప్రస్తుతం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక యాపిల్, సాంసంగ్ వంటి లేటెస్ట్ మొబైల్స్ కు గట్టి పోటీనే ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరా ఫీచర్స్ తో గూగుల్.. పిక్సెల్ మొబైల్స్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇక గూగుల్ పిక్సెల్ 9 ప్రో లేటెస్ట్ ఫీచర్స్ తో లాంఛ్ అయిపోయింది. ఇందులో ఆండ్రాయిడ్ 14 Tensor G4 చిప్‌సెట్, 45w ఫాస్ట్ ఛార్జింగ్, 4700HZ బ్యాటరీ సదుపాయం కూడా ఉన్నాయి. ఇక ఈ మొబైల్ పై మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఈ ఫీచర్స్ ను గూగుల్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.