BHEL Jobs: డిగ్రీ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ ప్రభుత్వ రంగ సంస్థ, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL)లో ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400
ఇందులో ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇంజనీర్ ట్రైనీ – 150 ఉద్యోగాలు
సూపర్ వైజర్ ట్రైనీ – 250 ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28
ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్ 70, ఎలక్ట్రికల్ 25, సివిల్ 25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్ 5, మెటలార్జీ 5 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్ 140, ఎలక్ట్రికల్ 55, సివిల్ 35, ఎలక్ట్రానిక్స్ 20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ పాసై ఉండాలి. సూపర్ వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీర్ డిప్లొమా పాసై ఉండాలి.
వయస్సు: 2025 ఫిబ్రవరి 1 నాటికి 27 ఏళ్లు మించరాదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, సూపర్ వైజర్ ట్రూనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32వేల వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1072(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 )
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2025 ఫిబ్రవరి 1
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28
పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 11, 12, 13
Also Read: APPSC Group-1 Exams: గ్రూప్-1 పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఇంకా 100 రోజుల సమయం..
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.