Samsung Galaxy S25 : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్.. సామ్ సాంగ్ గేలక్సీ S25 సిరీస్ (Samsung Galaxy S25 Series) ను తీసుకురాబోతుంది. ఇక ఈ మెుబైల్స్ లాంఛ్ సామ్సాంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో (Samsung Unpacked Event 2025) రేపే గ్రాండ్ గా లాంఛ్ కాబోతున్నాయి. ఇక లాంఛ్ వేళ ఈ సిరీస్ కు సంబంధించిన ధరలతో పాటు ఫీచర్స్ సైతం హల్చల్ చేస్తున్నాయి.
Samsung Galaxy S25 Seriesకు సంబంధించిన లీక్‌లు, రూమర్‌లు ఎప్పటి నుంచో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సిరీస్ లో Samsung Galaxy S25, Samsung Galaxy S25 Plus, Samsung Galaxy S25 Ultra తో సహా మూడు ఫోన్‌లను తీసుకువస్తుంది.
Samsung Galaxy S25 Series Features –
ఈ మెుబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. Samsung Galaxy S25 Ultra 6.86 అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై ఎండ్ వేరియంట్‌లో 16GB RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రాబోతుంది. ఇది 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్ 50MP టెలిఫోటో షూటర్, 3X జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రాబోతున్నట్లు సమాచారం.
ఈ సిరీస్ లో S25, S25+, S25 అల్ట్రా తో స్లిమ్ మెుబైల్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మెుబైల్స్ రేపే లాంఛ్ కాగా.. ఈ కొత్త స్లిమ్ మోడల్ మాత్రం మేలో లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక Samsung Galaxy S25, Galaxy S25+ మోడల్స్ కలర్ వేరియంట్స్ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఈ మోడల్స్ ఐదు కలర్ ఆప్షన్లలో రాబోతున్నట్లు తెలుస్తుంది. నలుపు, ఆకుపచ్చ, ఊదా, నీలం, సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
ఇక స్లిమ్ మోడల్ విషయానికి వస్తే… ఈ మెుబైల్స్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ గా రానుంది. Galaxy S25 స్లిమ్ మెుబైల్ లో హై క్వాలిటీ ఇమేజెస్ ను ఇచ్చే 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. S25 స్లిమ్ లో ఫ్రంట్ కెమెరా మిగిలిన సామ్ సాంగ్ మోడల్స్ లో ఉన్నట్లే 12MP కెమెరా ఉండనుంది.
ఈ మోడల్ మొబైల్స్ లో స్టోరేజ్ తో పాటు ప్రాసెసర్, డిస్ ప్లే అదిరేలా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సామ్ సాంగ్ A సిరీస్ మెుబైల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో ఇందులో ఉన్నట్లే 5000mah బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. సామ్ సాంగ్ ముందు మోడల్స్ లో వచ్చినట్టే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో ఈ మెుబైల్ రాబోతుందని.. 16 GB + 512 GB స్టోరీజ్ సదుపాయం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ALSO READ : ఇండియా తొలి క్రిప్టో కరెన్సీ.. ఎలా ఉపయోగించాలంటే!