BigTV English

Don’t type these six words in Google : గూగుల్ లో ఈ 6 పదాలు టైప్ చేస్తే.. ప్రమాదంలో పడినట్టే!

Don’t type these six words in Google : గూగుల్ లో ఈ 6 పదాలు టైప్ చేస్తే.. ప్రమాదంలో పడినట్టే!

Don’t type these six words in Google : డైలీ మీ కంప్యూటర్​, ల్యాప్​టాప్​, ఫోన్​లో అంతర్జాలాన్ని ఉపయోగిస్తూ బ్రౌజింగ్​ ఉపయోగిస్తున్నారా? అయితే ఇంటర్నెట్ యూజర్స్​ కోసం బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సొఫోస్​ ఓ హెచ్చరికను జారీ చేసింది. గూగుల్​లో ‘ఈ ఆరు పదాలను’ కలిపి టైప్​ చేసి సెర్చ్​ చేస్తే మీ డివైస్​లోని పర్సనల్​ డేటా​ హ్యాకర్ల చేతికి చిక్కడం ఖాయమని హెచ్చరించింది. తప్పనిసరిగా అంతర్జాలాన్ని రెగ్యూలర్​గా ఉపయోగించే యూజర్స్​ కోసం అర్జెంట్​ అలర్ట్​ను జారీ చేసింది. ఇంతకీ ఆ ఆరు పదాలు ఏంటి? గూగుల్​లో ఏ పదాలను కలిపి టైప్ చేస్తే మన డివైస్ హ్యాక్ అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.


ఇంతకీ ఆ పదాలు ఏంటంటే? – ఈ మధ్య కాలంలో హ్యాకర్లు పెట్రేగి పోతున్న సంగతి తెలిసిందే. దీంతో హ్యాకర్ల బెడద బాగా ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ యూజ్​ చేసే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ హడలెత్తిస్తున్నారు. వారి పర్సనల్ డేటాతో పాటు డబ్బును దొంగిలిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది సొఫోస్. ముఖ్యంగా మీ కంప్యూటర్​లో ‘Are Bengal Cats legal in Australia?’ అని టైప్ చేసి సెర్చ్ చేయడం ద్వారా హ్యాక్​కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మీ పర్సనల్​ డేటాను హ్యాకర్లు దొంగిలిస్తారని హెచ్చరించింది.


‘Are Bengal Cats legal in Australia?’ – సేమ్​ ఇదే విధంగా (కొంచెం కూడా మార్పు లేకుండా) అంటే ఉన్నది ఉన్నట్టుగా గూగుల్​లో టైప్​ చేయడం లేదా సెర్చ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది సొఫోస్. ఈ వర్డ్స్​ను కలిపి టైప్ చేయడం టాప్ రిజల్ట్స్​లో ఫేక్ లింక్స్​ వస్తాయని, వాటిని క్లిక్ చేయడం ద్వారా డేంజరస్​ మాలిసియన్ యాడ్స్, వెబ్​సైట్స్​లోకి రీడైరెక్ట్​ అవుతుందని చెప్పింది. కాబట్టి యూజర్స్​ జాగ్రత్త వహించాలని పేర్కొంది.

క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే? – ఒకవేళ యూజర్స్​ ఈ డేంజరస్​ లింక్స్​పై క్లిక్ చేయడం ద్వారా కంప్యూటర్స్​లో హిడెన్​ మాల్వేర్​ ప్రవేశిస్తుంది. ఇది ఎంట్రీ ఇచ్చాక సెకన్లలోనే గూట్​కిట్ అనే మరింత ప్రమాదకరమైన ప్రోగ్రామ్​ ప్రవేశించేలా చేస్తుంది. ఈ గూట్​కిట్​ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడంలో దిట్ట. అలాగే ఇది యూజర్స్​ నెట్​వర్క్​లోకి చొరబడిన తర్వాత ట్రోజాన్​(ఆర్​ఏటీ) అనే మాల్వేర్​ను సుధీర్ఘ కాలం సిస్టమ్​లో తిష్ట వేసేలా చేయడంతో పాటు అటాక్ చేసి కంప్యూటర్​ను పూర్తి కంట్రోల్​లోకి తీసుకుంటుంది. ఈ గూట్​కిట్​ ర్యాన్​సమ్​వేర్​ లేదా కోబాట్​ స్ట్రైక్​ వంటి ఇతర హానికరమైన మాల్వేర్​ను పంపించి కూడా సిస్టమ్​పై అటాక్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తుంది.

ముఖ్యంగా ‘Are Bengal Cats legal in Australia?’ను టైప్ చేసినప్పుడు ఇందులో ఆస్ట్రేలియా అనే పదం చాలా డేంజర్​ అని పేర్కొంది సొఫోస్​. ఎప్పుడైతే యూజర్ తెలీకుండా దాన్ని టైప్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్​పై క్లిక్​ చేస్తాడో ఆటోమేటిక్​గా హ్యాకర్​ చేతికి సున్నితమైన సమాచారం వెళ్లిపోతుందట. గూట్​లోడర్​ అనే ప్రోగ్రామ్​ ద్వారా బ్యాంక్ అకౌంట్ లాంటి సున్నితమైన డేటా ఇన్​ఫర్మేషన్​ దొంగిలించబడుతుందట. ఇది కేవలం సమాచారాన్ని దొంగిలించడమే కాకుండా యూజర్స్​ తమ కంప్యూటర్​ను యాక్సెస్​ చేయలేకుండా చేస్తుందని తెలిపింది సొఫోస్.

Australia, Hacking, Cyber Crime, Google Beware, Don’t type these six words in Google, Hackers. google hackers, hackers threat, google search, don’t type these words in google, google search, safe search, google aleret

కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఆరు పదాలను కలిపి టైప్ చేయకుండా ఉండాలని హెచ్చరిస్తోంది సొఫొస్​. హ్యాకింగ్​లో ఇదో కొత్త సైబర్ ట్యాక్టిక్​ అని పేర్కొంది. అలానే సెర్చ్​ ఇంజిన్​లో టాప్ రిజల్ట్స్​, సెర్చస్​లో ఎక్కువగా హానికరమై సైట్స్​, లింక్స్​ వచ్చేలా హ్యాకర్లు మానిపులేట్​ చేస్తున్నారని, దీన్ని ఎస్​ఈఓ పాయిజనింగ్ అంటారని తెలిపింది. యూజర్స్ జాగ్రత్త వహించాలని వెల్లడించింది.

ALSO READ : జొమాటో కొత్త ఫీచర్.. ఇకపై సగం ధరకే ఫుడ్.. అది కూడా నిమిషాల్లో డెలివరీ

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×