Shield Email Feature : జీమెయిల్ (Gmail) లో ఓ కొత్త ఫీచర్ను గూగుల్ (Google) సంస్థ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. షీల్డ్ ఈమెయిల్ (Shield Email) పేరుతో ఓ నయా ఫీచర్ను యూజర్స్‌కు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ఈ కొత్త జీమెయిల్ ఫీచర్.. స్పామ్ ఈమెయిల్ (Spam Emails), మెసేజ్లను నివారించేందుకు పని చేస్తుందని తెలిసింది. అలానే తమ పర్సనల్ ఈమెయిల్‌ను థర్డ్ పార్టీస్‌కు ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా, ప్రైవేట్‌గా ఉంచుకునేందుకు ఇది ఉపయోగపడేలా గూగుల్ సంస్థ అభివృద్ధి చేస్తోందట.
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఇప్పటికే పలు ఫీచర్స్ ను తీసుకువచ్చిన గూగుల్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. జిమెయిల్ కి వచ్చే ఇన్ స్పామ్ మెసేజ్లను అడ్డుకునేందుకు, కేవలం ఇన్కమింగ్ ఈమెయిల్స్ మాత్రమే వచ్చే విధంగా సరికొత్త ఫీచర్ను తీసుకురాబోతుందని తెలుస్తోంది.
ఓన్లీ ఇన్ కమింగ్ మాత్రమే (Only Incoming Emails) – అయితే ఈ నయా ఫీచర్ను మొదటగా లేటెస్ట్ ఆండ్రాయిడ్‌లోని జీమెయిల్ యాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనుందట. అయితే యాప్‌లోకి వెళ్లి ఈ కొత్త ఆప్షన్‌ను ఎంపిక చేయడం వల్ల మైఅకౌంట్.గూగుల్.కామ్ (My.Account.Google.Com) లోని ఓ ఖాళీ పేజీకి రీడైరెక్ట్ అవుతుందని టెక్ వర్గాలు అంటున్నాయి. గూగుల్ షీల్డ్ ఈమెయిల్ కేవలం ఇన్కమింగ్ ఈమెయిల్స్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుందట. దీని నుంచి ఔట్ గోయింగ్ ఉండదు. అంటే యూజర్స్ దీని నుంచి ఎటువంటి మెయిల్స్‌ను సెండ్ చేయలేరన్న మాట.
స్పామ్ మెయిల్స్ బెడద (Spam Mails) – ఇంకా ఈ షీల్డ్ ఈమెయిల్ ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే ఓ టెంపరరీ మెయిల్ అడ్రెస్‌ను క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఈ షీల్డ్ ఈమెయిల్ ఫీచర్.. టెంపరరీ మెయిల్ అడ్రెస్‌కు వచ్చిన ఈమెయిల్స్ మెసేజ్‌ను ఒరిజినల్ ఈమెయిల్ ఇన్ బాక్స్‌కు ఫార్వాడ్ చేస్తుంది. స్పామ్ మెయిల్స్‌ను గుర్తించి అడ్డుకుంటుందట. దీంతో యూజర్స్‌కు స్పామ్ మెయిల్స్ బెడద తప్పుతుంది. కేవలం అవసరమైన వాటినే పర్సనల్ ఈమెయిల్‌కు పంపుతుంది. ఒకవేళ ఈ టెంపరరీ అడ్రెస్‌కు ఈమెయిల్స్ రావద్దనుకుంటే, యూజర్స్ సింపుల్‌గా డిస్కార్డ్ చేసేయొచ్చు.
ఇంకా యూజర్స్ ఒకేసారి మల్టిపుల్ షీల్డ్ ఈమెయిల్స్‌ను ఉపయోగించుకునే వీలుని కల్పిస్తుందట గూగుల్. అయితే ప్రస్తుతానికి ఈ షీల్డ్ ఈమెయిల్ అనేది కేవలం జీమెయిల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ఇంకా ఈ ఫీచర్ను అఫీషియల్‌గా కన్ఫామ్ చేయలేదు. కాబట్టి ఈ ఫీచర్ పూర్తిగా డెవలప్ చేసి గూగుల్ ఇంట్రడ్యూస్ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఇక ఏది ఏమైనా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారుల భద్రత మరింత మెరుగవుతుందనే చెప్పాలి. నేటి రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఈమెయిల్స్ ను ఆధారంగా చేసుకొని పలు నేరాలకు పాల్పడుతున్నారు. విలువైన సమాచారాన్ని దోచేస్తున్నారు. ఇక ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వీటన్నిటికీ గూగుల్ అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది. ఇకపోతే రీసెంట్‌గానే గూగుల్ క్యాలెండర్‌తో అనుసంధానిస్తూ జీమెయిల్లో జెమినీ ఏఐ పని తీరును మరింత మెరుగు పరిచింది.
ALSO READ : ఫ్రీ ఫిట్నెస్ కోచ్ కావాలా… ఈ ట్రాకింగ్ యాప్స్ పై లుక్కెయ్యాల్సిందే!