Best Fitness Trackers : నేటి బిజీ లైఫ్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం పెద్ద సవాలుగా మారింది. ఇక ఫిట్‌నెస్ కోచ్ సహాయం తీసుకోవడం, ఎప్పుడూ వెంట ఉంచుకోవటం సాధ్యం కాదు. అందుకే ఫిట్‌నెస్ కోచ్ లాంటి సపోర్ట్‌ను అందించే ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ మీ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడమే కాకుండా, మీ ఆహారం విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాయి. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా, ఫిట్నెస్ ను పెంచుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యంగా ఉండాలనుకున్నా ఈ యాప్స్ ప్రతీ విషయంలో సహాయం చేస్తాయి.
ఈ ఊరుకుల పరుగులు జీవితంలో ఫిట్నెస్ కు ఇచ్చే టైం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా జిమ్ కు వెళ్లి కోచ్ ను పెట్టుకొని ప్రతి సారి ఫిట్నెస్ ను ఫాలో అవ్వాలి అంటే అయ్యే పని కాదు. ఇందుకోసమే అధునాతనంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చేసాయి. వీటితో మీ డైలీ లైఫ్ మరింత ఆసక్తికరంగా మారిపోతుంది.
Google Fit: Activity Tracking – ఫిట్‌నెస్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ యాప్ మంచి ఎంపిక. ప్లే స్టోర్ లో ఈ యాప్ కు 10 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి. మీరు దీన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించవచ్చు. ఈ యాప్ స్టెప్ కౌంట్ నుండి హృదయ స్పందన రేటు, నిద్ర పోయే స్థితి వరకూ ప్రతీ విషయంలో సహాయం చేస్తుంది.
Daily Yoga – ప్రతిరోజూ యోగా చేసేవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 500 కంటే ఎక్కువ ఆసనాలు, 1000 కంటే ఎక్కువ యోగా, చిట్కాలు, వ్యాయామ టైమర్స్ ఉన్నాయి. కావాలంటే యోగా యొక్క వ్యవధి, లెవెల్, టార్గెట్, శైలిని సైతం అనుకూలీకరించవచ్చు. ఇది కాకుండా 40 కంటే ఎక్కువ మంది యోగా కోచ్ ల సలహాలు సైతం తీసుకునే అవకాశం ఉంటుంది.
Fitbit – ఈ యాప్ మీ శారీరక శ్రమ, నిద్ర, హృదయ స్పందన రేటును పర్యవేక్షిస్తుంది. రోజువారీ ఫిట్‌నెస్ దినచర్యను అనుసరించేలా ప్రతీరోజూ ప్రేరేపిస్తుంది.
HealthifyMe – ఇతర యాప్‌ల మాదిరిగానే ఇది కూడా ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. వర్కవుట్ ట్రాకర్ కాకుండా, ఇది బరువు తగ్గించే ట్రాకర్, వాటర్ ట్రాకర్, ఫుడ్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, హ్యాండ్‌వాష్ ట్రాకర్ కూడా. ఇంతే కాకుండా ఇందులో వినియోగదారులు పూర్తి శరీర వర్కౌట్‌లు, యోగా వర్కౌట్‌లను కలిగి ఉన్న నో-ఎక్విప్‌మెంట్ హోమ్ వర్కౌట్ వీడియోలకు కూడా యాక్సెస్ పొందుతారు.
Nike Training Club – నైక్ ట్రైనింగ్ క్లబ్ ఉచిత వర్కౌట్‌లతో బెస్ట్ రిజల్ట్ ను అందిస్తుంది. కార్డియో, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఈ యాప్‌తో మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.
Step Counter – ఏ వ్యక్తికైనా నడక చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా స్టెప్ కౌంటర్‌ని ఉపయోగించగలగడానికి కారణం ఇదే. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ లో సెన్సార్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. దీనికి GPS ట్రాకింగ్ అవసరం లేదు, కాబట్టి మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ యాప్ 4.8 సమీక్ష రేటింగ్‌ను కలిగి ఉంది ఇక 5 కోట్ల కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్స్ ను కలిగి ఉంది.
ALSO READ : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!