BigTV English

Joe Biden : అధికారం పోతుందని బైడెన్ అంతపని చేశారా.? ప్రపంచం అంతమైనా ఏం కాదనుకున్నారా.?

Joe Biden : అధికారం పోతుందని బైడెన్ అంతపని చేశారా.? ప్రపంచం అంతమైనా ఏం కాదనుకున్నారా.?

Joe Biden : ట్రంప్ అధికారంలోకి వచ్చే సమయానికి మూడో ప్రపంచ యుద్ధం రావాలనే తీరుగా బైడెన్ యంత్రాంగం వ్యవహరించిందంటూ.. ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ విమర్శించారు. తన పరిపాలన ముగిసే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను జూనియర్ ట్రంప్ (Trump Jr.) తప్పుపట్టారు. బైడెన్ నిర్ణయాలు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనకు ఆటంకాలు సృష్టించేవిగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా.. ట్రంప్ వాటన్నింటినీ విజయవంతంగా ఛేదిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు


ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు పూర్తి స్థాయి అండదండలు అందిస్తోంది. మిత్ర దేశ రక్షణ కోసం భారీ ఎత్తున నిధుల్ని సమకూర్చిన అమెరికా.. తన అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాల్ని సైతం అందిస్తోంది. అయితే.. విదేశాలు సమకూర్చే క్షిపణులు, బాలిస్టిక్ మిస్సైల్స్ వంటివి వినియోగిస్తే.. ఆ దేశమే తమపై దాడి చేసినట్లు భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలోనే హెచ్చరించారు. ఆ కారణంగానే.. భారీ మిస్సైళ్ల వంటి వాటి వినియోగానికి ఉక్రెయిన్ సైన్యాన్ని ఇన్నాళ్లు అనుమతించలేదు. చాన్నాళ్లుగా ఉక్రెయన్ అధ్యక్షుడు వాద్లిమిక్ జెలెన్స్ కీ (Volodymyr Zelensky) సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే ఆయుధాల వినియోగానికి అనుమతివ్వాలంటూ కోరుతున్నా అమెరికా మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.

కానీ.. అనూహ్యంగా బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే (Army Tactical Missile Systems) ఆయుధాల వినియోగానికి ఉక్రెయిన్ కు అనుమతి లిభించింది.  ఈ నిర్ణయమే ఇప్పుడు విమర్శలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. బైడెన్ యంత్రాగం వ్యవహార శైలిని తప్పుపట్టిన జూనియర్ ట్రంప్.. తన తండ్రి డోనాల్డ్ ట్రంప్ పరిపాలనకు అడ్డంకులు సృషించే ప్రయత్నంగా ఆరోపించారు.  ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితేసేలా ఉద్రిక్తతలను రేకెత్తించారంటూ ఆరోపణలు చేశారు. అయితే..అలాంటి చర్యల్ని ట్రంప్ సులువుగానే నిలువరించగలరంటూ వ్యాఖ్యానించారు.


ఉక్రెయిన్ పై రెండేళ్ల నుంచి దాడుల్ని కొనసాగిస్తున్న రష్యా.. ఇటీవలే ఉత్తర కొరియా సాయమూ తీసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన 15 వేల మంది సైన్యం.. కుర్స్క్ ప్రాంతంలో మెహరించి ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యాలోని సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించేందుకు.. ఉక్రెయిన్ యూఎస్ ఆయుధాలు వినియోగించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపు ఖాయమవుతున్న తరుణంలో.. ఉక్రెయన్ – రష్యా యుద్ధం గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తానని.. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం కనుక్కుందామని ప్రకటించారు.

Also Read : అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉక్రెయిన్ కోసం బైడెన్ భారీ సాయం.. ఆయుధాల వినియోగానికి అనుమతి

బైడెన్ నిర్ణయం గురించిన వార్తలు బయటకు రాగానే.. యూఎస్ లోని చాలామంది నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రష్యాలోని భూభాగాలపైకి అమెరికా ఆయుధాలు ప్రయోగించడం సరైన చర్య కాదంటూ పోస్టులు పెడుతున్నారు. అమెరికా పై యుద్ధానికి రష్యా ఏదైనా దేశానికి ఆయుధాలు అందిస్తే ఎలా ఉంటుందో.. ఆలోచించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×