
Green Steel:- ప్రస్తుతం గాలిలో కలుస్తున్న కార్బన్ శాతాన్ని కంట్రోల్ చేయాలన్నా.. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావాలన్నా గ్రీన్ గూడ్స్ అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో గ్రీన్ గూడ్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే దాదాపు అన్ని రంగాల్లో ప్రొడక్ట్స్ అనేవి ప్రకృతిసిద్ధంగా తయారు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రీన్ స్టీల్‌ను కూడా తయార చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ కోసం పలు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఊపందుకుంది. దీన్ని బట్టి ఎన్నో ఇతర రంగాలు కూడా గ్రీన్ ప్రొడక్ట్స్‌ను తయారు చేయాలనుకుంటున్నాయి. అందులో స్టీల్ కూడా ఒకటి. గ్రీన్ స్టీల్‌ను తయారు చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి స్టీల్ సంస్థలు. కానీ పలు కారణాల వల్ల ఇండియాలో గ్రీన్ స్టీల్ తయారీకి చాలా సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
గ్రీన్ స్టీల్ అంటే కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయని వనరులతో స్టీల్‌ను తయారు చేయడం. అంటే స్టీల్ తయారీలో ఆక్సిజన్‌కు బదులుగా హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న ఐరన్ కారణంగా గ్రీన్ స్టీల్ తయారీ కష్టమని తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు పరిశోధనల తర్వాత ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇండియాలో ఉన్న ఐరన్ ఓర్ తక్కువ గ్రేడ్‌కు సంబంధించిందని, ఇది గ్రీన్ స్టీల్ తయారీలో ఉపయోగపడదని అన్నారు.
2021లో ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కలిసి ఇండియా, ఆస్ట్రేలియా గ్రీన్ స్టీల్ పార్ట్‌నర్‌షిప్‌పై సంతకం చేశారు. ఈ పార్టనర్‌షిప్ ప్రకారం రానున్న మూడున్నర ఏళ్లలో రెండు దేశాల్లో స్టీల్ తయారీ మెరుగుపరచాలని అనుకున్నారు. అయితే స్టీల్ తయారీ కంటే ముందు ఐరన్ ఆక్సైడ్‌ను హైడ్రోజన్‌గా మార్చే పనిలో పడ్డారు. ముందు ఈ ప్రయోగాలు సక్సెస్ అయితేనే గ్రీన్ స్టీల్ తయారీ సక్సెస్ అవుతుందుని పరిశోధకులు చెప్తున్నారు. కానీ దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు.