E-Paper
Advertisement

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్
Advertisement

Noise Buds Mini X TWS: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారి పోయాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు, లేదా వ్యాయామం చేసే సమయంలో.. పాటలు వినడానికి లేదా ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ఇయర్‌ బడ్స్ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. మార్కెట్లో అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో బెస్ట్ టెక్నాలజీని అందించడంలో ‘నాయిస్’ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఈ కోవలోనే.. అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన సరి కొత్త మోడలే ఇది. కేవలం రూ.999 ధరకే లభిస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,కంఫర్ట్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే..ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా , ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో హాఫ్ ఇన్-ఇయర్ డిజైన్ ను అందించారు. సిలి కాన్ ఇయర్ టిప్స్ చెవుల్లో.. పెట్టడం ఇష్టపడని వారికి ఈ డిజైన్ ఎంతో సౌకర్య వంతంగా ఉంటుంది. ఎంత సేపు చెవుల్లో పెట్టుకున్నా.. ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. దీని కార్బన్ బ్లాక్ కలర్ వీటికి మరింత స్టైలిష్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల పాకెట్‌లో లేదా చిన్న బ్యాగ్‌లో చాలా ఈజీగా దీనిని సర్దుకోవచ్చు.

సౌండ్ క్వాలిటీ, డ్రైవర్స్:

తక్కువ ధరలో.. వస్తున్నప్పటికీ సౌండ్ విషయంలో నాయిస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ 12mm టైటానియం-కోటెడ్ డ్రైవర్లను వాడారు. దీని వల్ల పాటలు వినేటప్పుడు బేస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే వోకల్స్ , హై-నోట్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్‌గా ఉంటాయి. మ్యూజిక్ లవర్స్‌కు ఇది ఒక మంచి మ్యూజికల్ ఫీల్ ఇస్తుంది.

బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ అతి పెద్ద హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. కేవలం రూ.999 ధర కేటగిరీలో.. ఏకంగా 50 గంటల టోటల్ ప్లేటైమ్ అందించడం నిజంగా విశేషం. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఈ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా వాడుకున్నా బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ ఉండదు. ప్రయాణాలు చేసే వారికి, తరచూ ఛార్జ్ చేయడం ఇష్టం లేని వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

కాల్ క్వాలిటీ ,కనెక్టివిటీ:

ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఎదుటి వారి గొంతు స్పష్టంగా వినపడాలన్నా..మన గొంతు వారికి క్లియర్‌గా చేరాలన్నా మైక్ పని తీరు చాలా ముఖ్యం. ఈ ఇయర్‌బడ్స్‌లో క్వాడ్ మైక్ ఈఎన్సీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చుట్టుపక్కల ఉండే నాయిస్ తగ్గించి, కేవలం మీ గొంతును మాత్రమే.. స్పష్టంగా అవతలి వారికి వినిపించేలా చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే..ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ అయిన బ్లూటూత్ v6.0 సపోర్ట్ ఉంది. దీని వల్ల ఫోన్‌కి ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. ఎలాంటి కనెక్షన్ డ్రాప్స్ లేకుండా స్థిరమైన సిగ్నల్ అందుతుంది. అంతే కాకుండా ఒకే.. సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ పేరింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Also Read:  తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

అదనపు ఫీచర్లు, వాటర్ రెసిస్టెన్స్:

గేమ్స్ ఆడే వారి కోసం ఇందులో.. లో-లేటెన్సీ మోడ్ అందుబాటులో ఉంది.అలాగే.. డైలీ వాడకంలో చెమట పట్టినా లేదా చిన్న పాటి వర్షంలో తడిచినా ఇయర్‌ బడ్స్ పాడవకుండా ఉండటానికి IPX4 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఇచ్చారు. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ మార్చడం చాలా ఈజీ.

రూ.1000లోపు బడ్జెట్‌లో.. 50 గంటల బ్యాటరీ లైఫ్, 12mm డ్రైవర్లు, బ్లూటూత్ v6.0, క్వాడ్ మైక్ ఈఎన్సీ వంటి లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో బెస్ట్ ఫీల్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక పర్ఫెక్ట్ గాడ్జెట్.

Related News

రూ.749కే ‘హామర్ వేవ్’బ్లూటూత్ స్పీకర్..ఫీచర్లు చూస్తే అస్సలు వదలరు!

తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

బిగ్,బోల్డ్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ లాంచ్..పూర్తి ఫీచర్లివే!

ప్రైస్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ,ఈ ఇయర్ యూత్ మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌వాచ్ ఇదే!

రూ.30 వేలలోపు బెస్ట్ 4K క్యూఎల్ఈడీ టీవీ ఇదే..ఫీచర్లు చూస్తే షాకవుతారు!

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు, ఇబ్బందుల్లో లక్షలాది మంది

పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

Big Stories

Advertisement
×