Samsung Galaxy Watch Ultra review: స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో టెక్ దిగ్గజం శాంసంగ్ తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.సామాన్య కస్టమర్ల నుంచి ఫిట్‌నెస్ లవర్స్ వరకు అందరి అంచనాలను అందుకునేలా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లను పరిచయం చేస్తూనే ఉంది. ఈ కోవలోనే అత్యంత పవర్ ఫుల్, రగ్గడ్ డిజైన్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి వచ్చింది. అదే Samsung Galaxy Watch Ultra. మార్కెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ మోడల్ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి ఫీచర్లు:
ఈ వాచ్‌ను మొదటి సారి చూసినప్పుడు దీని సైజ్, బోల్డ్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇది సాధారణ స్మార్ట్ వాచ్‌ల కంటే.. చాలా భిన్నంగా, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారైంది. ఇందులో గ్రేడ్ 4 టైటానియం ఫ్రేమ్, స్క్రాచ్‌లను తట్టుకునే సఫైర్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇది కేవలం చూడటానికి మాత్రమే కాకుండా.. వాస్తవంగా కూడా చాలా దృఢంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు 10 ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అంటే ఈత కొట్టేటప్పుడు లేదా భారీ వర్షంలోనూ దీన్ని ఉపయోగించవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రాలో 1.5 ఇంచుల సూపర్ అమెలోడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. దీని రిజల్యూషన్ 480 x 480 పిక్సెల్స్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్పష్టంగా ,రంగుల మయంగా కనిపిస్తుంది. ఎండలో.. బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న సమాచారం ఎలాంటి ఇబ్బంది లేకుండా.. స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. ఇందులో రొటేటింగ్ బెజెల్ లేకపోయినా, హై-సెన్సిటివిటీ టచ్‌స్క్రీన్ మోడ్ ద్వారా దీన్ని ఈజీగా నావిగేట్ చేయెచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ పవర్ ఫుల్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీనికి తోడు 2GB RAM , 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఇది Wear OS ఆధారంగా పని చేస్తుంది. యాప్‌లను ఓపెన్ చేయడం, స్క్రోల్ చేయడం వంటి అన్ని పనులు ఎంతో స్మూత్‌గా, ఎలాంటి లాగ్స్ లేకుండా జరుగుతాయి. సామ్‌సంగ్ ఎకోసిస్టమ్‌లోని ఇతర గెలాక్సీ ఫోన్‌లతో ఇది ఇట్టే కనెక్ట్ అవుతుంది.
ఆరోగ్య స్పృహ ఉన్న వారికి ఈ వాచ్ ఒక అద్భుతమైన గైడ్‌లా పని చేస్తుంది. ఇందులో లేటెస్ట్ బయో యూక్టీవ్ సెన్సార్ ఉంది. ఇది హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ అనాలిసిస్, ఈసీజీ, బ్లడ్ ప్రెజర్ వంటి మెడికల్ డేటాను అందించడంలో సహాయ పడుతుంది. అంతేకాకుండా..గెలాక్సీ ఏఐ సపోర్ట్‌తో మీ రోజువారీ ఎనర్జీ స్కోర్, ఫిట్‌నెస్ వివరాలను ఇది ఖచ్చితంగా లెక్కిస్తుంది. మారథాన్‌లు, ట్రయాథ్లాన్‌లు, సైక్లింగ్ చేసే వారి కోసం ప్రత్యేకమైన మల్టీ-స్పోర్ట్ ట్రాకింగ్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Also Read: ప్రైస్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ,ఈ ఇయర్ యూత్ మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌వాచ్ ఇదే!
ఈ వాచ్‌లో 590 mAh బ్యాటరీను ఉపయోగించారు. సాధారణ వాడకంలో.. ఇది మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పవర్ సేవింగ్ మోడ్ ద్వారా బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ పాటు పొడగించుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ అవకాశం ద్వారా దీన్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
మార్కెట్లో దీని ధర సుమారు రూ.59,999 వరకు ఉంది. ధర కొంచెం ఎక్కువగా.. అనిపించినప్పటికీ, ఇది అందించే ప్రీమియం టైటానియం బిల్డ్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లే.. దీనికి పూర్తి న్యాయం చేస్తాయి. మీరు ఒక పటిష్టమైన, ఫీచర్స్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ మీకు చాలా బాగా ఉపయోగ పడుతుంది.