LG Xboom Bounce: మార్కెట్లో రోజుకో కొత్త బ్లూటూత్ స్పీకర్ వస్తున్నప్పటికీ..కొన్ని మాత్రమే టెక్ లవర్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG సంస్థ విడుదల చేసిన ఈ మోడల్ సరిగ్గా.. అలాంటి కోవకే చెందుతుంది.ఇది చూడటానికి అచ్చం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని హై-టెక్ ప్రాప్‌లా కనిపిస్తూ.. ఆడియో పరంగా అంచనాలను తలకిందులు చేసేలా పవర్‌ఫుల్ సౌండ్‌ను అందిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ ఆర్టిస్ట్ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ స్పీకర్ పూర్తి రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి పీచర్లు:
ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని వినూత్నమైన డిజైన్. సాధారణ సిలిండ్రికల్ స్పీకర్ల లాగా.. కాకుండా, ఇది ఒక ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ డివైస్ లేదా సైన్స్ ఫిక్షన్ మూవీలోని మిషన్ లా కనిపిస్తుంది. దీని బాడీపై ఉండే ..మెటల్ ప్లేట్స్, మ్యూజిక్‌కు తగ్గట్టుగా సింక్ అయ్యే డైనమిక్ ఎల్ఈడీ లైటింగ్ ఎఫెక్ట్స్ దీనికి ఒక ఇండస్ట్రియల్ లుక్‌ను తెచ్చిపెడతాయి. దీనిని రూమ్‌లో ఎక్కడ పెట్టినా ఇది ఇంటీరియర్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాకుండా..ఇది వాటర్ , డస్ట్ రెసిస్టెంట్‌గా పని చేస్తుంది. దీనికి ఇచ్చిన క్యారీయింగ్ స్ట్రాప్ ప్రయాణాల్లో.. తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
“చూడటానికి డిజైన్ బాగుంది కానీ సౌండ్ ఎలా ఉంటుంది?” అనే సందేహం చాలా మందికి రావచ్చు. అయితే.. LG దీనిలో ఎలాంటి రాజీ పడలేదు. ఈ స్పీకర్ అందించే.. ఆడియో అవుట్ పుట్ నిజంగా ఊహకందనంత అద్భుతంగా ఉంది.
బేస్ :డీప్ , పంచీ బేస్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.మ్యూజిక్ వింటున్నప్పుడు బీట్స్ చాలా క్లియర్‌గా, పవర్ ఫుల్‌గా వినిపిస్తాయి.
వొకల్స్, ట్రెబుల్: పాటల్లోని వొకల్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్స్ స్పష్టంగా వినబడతాయి. యాప్ ద్వారా అందించే.. కస్టమ్ ఈక్వలైజర్ ,బేస్ బూస్ట్ మోడ్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా ఆడియోను సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ వాల్యూమ్ పెంచినా కూడా ఆడియోలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకపోవడం దీని ప్రత్యేకత.
మోడరన్ టెక్నాలజీకి.. తగినట్టుగా LG దీన్ని బెస్ట్ ఫీచర్లతో తీర్చిదిద్దింది. లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ దీనిలో.. ఉండటం వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ లాస్ లేదా ఆడియో లాగ్ సమస్యలు అసలు ఉండవు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే లైటింగ్ ఆఫ్‌లో.. ఉంచి మోడరేట్ వాల్యూమ్‌లో వాడితే సుమారు 30 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. అలాగే.. దీనిలోని రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: ప్రైస్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ,ఈ ఇయర్ యూత్ మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌వాచ్ ఇదే!
AI సౌండ్ మోడ్: ప్లే అవుతున్న ఆడియో కంటెంట్‌ను బట్టి సౌండ్ ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ అవుతుంది.
మల్టీ-పాయింట్ కనెక్షన్: ఒకే సమయంలో.. రెండు డివైజెస్‌ను దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు.
మై బటన్: స్పీకర్ పైభాగంలో.. ఉండే ఈ బటన్ ద్వారా మీకు నచ్చిన ప్లే లిస్ట్‌ను సింగిల్ టచ్‌తో ప్లే చేయెచ్చు.