BigTV English

Hero Mavrick 440: హీరో మోటోకార్ప్ నుంచి మరో స్టైలిష్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

Hero Mavrick 440: హీరో మోటోకార్ప్ నుంచి మరో స్టైలిష్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

Hero Mavrick 440 : రోజుకో కొత్త రకం వాహనాలు మార్కెట్‌లో విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లుక్, డిజైన్‌తో రోడ్లపై చక్కర్లు కొడుతూ వాహన ప్రియులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాహనాలలో మార్పులు చేస్తూ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రముఖ కంపెనీ తన అద్భుతమైన బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.


బైక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ హీరో మావెరిక్ 440’ బైక్‌ను హీరో మోటోకార్ప్ తాజాగా లాంచ్ చేసింది. అయితే దీనిని ఈ ఏడాది మొదట్లో అంటే జనవరిలో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో ఈ బైక్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ బైక్ బేస్, మిడ్, టాప్ అనే మూడు వేరియంట్లలో రిలీజైంది. ఇక ఈ బైక్‌ను లాంచ్ చేసిన కంపెనీ దీని ధరను కూడా వెల్లడించింది. అంతేకాకుండా ఈ బైక్ బుకింగ్‌లు సైతం ప్రారంభించినట్లు తెలిపింది.


Read More: ఇండియాలో లాంచ్ అయిన ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్.. ధర ఎంతంటే?

ఈ మావెరిక్ 440 బైక్ అనేది హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్400 బైక్‌ పోలికలను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో 440cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. అలాగే ఇందులో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ద్వారా 6 స్పీడ్ గేర్‌బాక్సాను అందించారు. ఈ ఇంజన్ 27bhp శక్తిని 36NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక స్లైలింగ్, 17 అంగుళాల చిన్న ఫ్రట్ వీల్‌ను కలిగి ఉంటుంది. అలాగే వెనుక టైర్‌తో సహా మరికొన్ని సాంకేతిక మార్పులు చేశారు.

ఈ బైక్ డిజైన్‌ను పరిశీలిస్తే.. అద్భుతమైన స్పోర్టియర్ లుక్‌తో ఇది వచ్చింది. పూర్తి LED లైట్లు, ఇ-సిమ్ కనెక్టివిటీతో సహా మొత్తంగా 35 ఫీచర్లను ఈ బైక్ కలిగి ఉంది. వీటిని ఆపరేట్ చేసేందుకు డిజిటల్ నెగటివ్ ఎల్‌సిడీ క్లస్టర్‌ను అందించారు.

ఇందులో ఇక బేస్ వేరియంట్‌ను స్పోక్ వీల్స్‌తో అందిస్తుండగా.. టాప్ ఎండ్ మోడల్‌లో స్లైలిష్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయెల్ ఇండికేటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను ఈ బైక్‌లో అందించారు.

Read More: మార్కెట్‌లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే?

ఇక భారత మార్కెట్‌లో ఈ బైక్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 1.99 లక్షలు.. అలాగే మిడ్ వేరియంట్ ధర రూ.2.14 లక్షలు.. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.24 లక్షల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఇక ఈ బైక్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఈ బైక్ కంపెనీ కళ్లుచెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. ‘వెల్‌కమ్ టు మావెరిక్’ పేరుతో ఓ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 15లోపు ఈ బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ.10,000 విలువైన కస్టమైజ్డ్ యాక్సెసరీస్ కిట్‌ను గిఫ్ట్‌గా అందిస్తోంది.

ఈ బైక్‌లను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఏప్రిల్‌ నుంచి డెలివరీలు చేయనున్నారు. ఆసక్తి గల కస్టమర్లు సమీప డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బైక్‌ను బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×